ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 9AM - ఏపీ ముఖ్యవార్తలు

...

top news
top news

By

Published : Jan 21, 2022, 9:02 AM IST

  • AP Cabinet Meeting: నేడు మంత్రివర్గ సమావేశం.. 32 అంశాలతో అజెండా
    సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మొత్తం 32 అంశాలతో కేబినెట్ అజెండా నిర్ణయించారు. పీఆర్సీ వేతన సవరణ వ్యవహారం, ఉద్యోగుల ఆందోళనలపై కేబినెట్​లో చర్చించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సీఎం జగన్​కు ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి లేఖ
    సీఎం జగన్​కు ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి లేఖ రాశారు. 23.29 శాతం ఫిట్మెంట్ మధ్యంతర భృతి కన్నా .. తక్కువగా ఉందన్నారు. ఈ విధంగా ఫిట్మెంట్‌ ను తగ్గించిన దాఖలాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • NTR TRUST : కరోనా బాధితులకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్
    కరోనా బాధితుల‌కు ఆన్ లైన్ లో ఉచిత వైద్య సేవ‌ల ప్రక్రియ‌ను ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రారంభించింది. జూమ్ కాల్ ద్వారా డాక్టర్లు వైద్య స‌హాయం అందించారు. కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న కార‌ణంగా నేటి నుంచి రోజుకు 1000 మందికి టెలిమెడిసిన్ ద్వారా వైద్య సాయం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రభుత్వం కీలక నిర్ణయం.. తరగతుల విలీనంపై విద్యాశాఖ ఆదేశాలు
    రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఒకే ఉన్నత పాఠశాల ఉంటే వెయ్యి మంది విద్యార్థులున్నా 3,4,5 తరగతులను విలీనం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'తండ్రి ఆస్తుల్లో.. వారి కంటే కుమార్తెలకే ప్రాధాన్యం'
    తండ్రి ఆస్తుల్లో కుటుంబంలోని దాయాదుల కంటే కుమార్తెలకే ప్రాధాన్యం ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. చనిపోయిన హిందూ పురుష వ్యక్తి.. సోదరుల కుమారులు, కుమార్తెల కంటే అతని సొంత కుమార్తెలకే ప్రాధాన్యం ఇవ్వాలని ధర్మాసనం తీర్పు చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Uttarakhand Election: భాజపా తొలి జాబితా- కొందరు సిట్టింగులపై వేటు​
    ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 59 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది భాజపా. ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామితోపాటు 11 మంది మంత్రులు, ఉత్తరాఖండ్‌ భాజపా అధ్యక్షుడు మదన్‌ కౌషిక్‌కు.. ప్రస్తుతం వారు ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాలే కేటాయించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అదానీ గ్రూప్​ నుంచి మరో ఐపీఓ.. వచ్చేది ఎప్పుడంటే?
    అదానీ గ్రూప్​ నుంచి మరో కంపెనీ పబ్లిక్​ ఇష్యూకు రానుంది. ఫార్చూన్​ బ్రాండ్​పై వంటనూనెలు విక్రయించే అదానీ విల్మర్​ ఐపీఓ ఈ జనవరి 27న ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వారసులతో కలిసి వెండితెరపై.. టాలీవుడ్​లో సందడే సందడి
    చిత్రసీమలో మల్టీస్టారర్లకు ఉండే క్రేజ్‌ వేరు. ఇద్దరు అగ్రతారలు కలిసి నటిస్తున్నారని తెలిస్తే చాలు.. ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇక అదే స్టార్లు.. తమ నట వారసులతో కలిసి సందడి చేస్తున్నారని తెలిస్తే ఆ అంచనాలు తారా స్థాయిని దాటేస్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టీ20 వరల్డ్​కప్ షెడ్యూల్​ రిలీజ్.. భారత్-పాక్ మ్యాచ్​ ఎప్పుడంటే?
    ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్​ రిలీజైంది. ఇందులో భాగంగా తన తొలి మ్యాచ్​లో దాయాది పాకిస్థాన్​తో భారత తలపడనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details