ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9AM - 9AM TOPNEWS

ప్రధాన వార్తలు @9AM

9AM TOP NEWS
ప్రధాన వార్తలు @9AM

By

Published : Nov 26, 2021, 9:01 AM IST

  • TDP POLITBURO MEETING TODAY: ఈరోజు మధ్యాహ్నం తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం

TDP PARLIAMENTARY PARTY MEETING: ఎన్టీఆర్ భవన్​లో నేడు తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. అలాగే తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు.

  • Karimnagar Accident today : చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

Karimnagar Accident today : తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కరీంనగర్​లోని జ్యోతినగర్​ వాసులుగా గుర్తింపు.

  • Water in the gas cylinder: గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు... అవాక్కైన వినియోగదారుడు...

ప్రకాశం జిల్లాలో ఓ గ్యాస్ వినియోగదారుడికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. గ్యాస్ ఏజన్సీ నుంచి సిలిండర్ బుక్ చేసుకుంటే.. అందులో గ్యాస్​కు బదులుగా నీళ్లు బయటకు వచ్చాయి. ఈ విచిత్ర పరిస్థితిని చూసి ఇంటిల్లిపాదీ అవాక్కయ్యారు. గ్యాస్ ఏజెన్సీని సంప్రదించగా.. వేరేది ఇస్తామని చెప్పినట్లు వినియోగదారుడు తెలిపారు.

  • Constitution Day 2021: ఆర్డినెన్సులు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు!

నవంబరు 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే.. అంతకుముందే కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధిపతుల పదవీకాలాన్ని పొడిగిస్తూ ఆర్డినెన్సులు తీసుకురావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

  • Earthquake: భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్​పై 6.1 తీవ్రత

మిజోరం ఈశాన్యప్రాంతంలోని తెంజావల్​లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల15నిమిషాల సమయంలో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(ఎన్​సీఎస్​) స్పష్టం చేసింది. రిక్టర్ స్కేల్​పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు పేర్కొంది.

  • రూ.50లక్షల కోట్లు దాటిన పాకిస్థాన్​ అప్పులు

ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పాకిస్థాన్​ అప్పులు రూ.50 లక్ష కోట్లు దాటినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ మొత్తంలో రూ.20 లక్షల కోట్లు ఇమ్రాన్ ఖాన్​ హయాంలోనే పెరిగినట్లు వెల్లడించింది.

  • 'ఆ కరెన్సీలకు ప్రాథమిక విలువ లేదు'

క్రిప్టో కరెన్సీలకు(Cryptocurrency In India) ప్రాథమిక విలువ లేదని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌ గార్గ్‌ తెలిపారు. క్రిప్టో కరెన్సీలపై 2017లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు. క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిషేధించాలని కమిటీ సిఫారసు చేసింది.

  • World Chess Championship 2021: కార్ల్‌సన్‌కు ఎదురుందా?

World Chess Championship 2021: ప్రపంచ చెస్‌ ఛాంపియన్​షిప్ సమరం శుక్రవారం(నవంబర్ 26) నుంచే ప్రారంభం కానుంది. దుబాయ్‌ వేదికగా జరిగే ఈ పోరులో ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్​సన్, రష్యా ఆటగాడు ఇయాన్ నిపోమ్​నిషి తలపడనున్నారు.

  • ఆసీస్ క్రికెటర్ పైన్.. క్రికెట్​కు కొన్నాళ్లు దూరం!

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ నేపథ్యంలో టెస్టు జట్టు మాజీ సారథి టిమ్​ పైన్(tim paine news) అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పైన్ కీలక ప్రకటన చేశాడు. కొద్ది రోజుల పాటు క్రికెట్​కు దూరంగా ఉండనున్నట్లు పేర్కొన్నాడు.

  • సూర్యతో ముద్దుగుమ్మ కీర్తి సురేశ్ మరోసారి?

'గ్యాంగ్‌' చిత్రంతో ఆకట్టుకున్న జంట సూర్య, కీర్తి సురేశ్. ఇప్పుడు ఈ జోడీ మరోసారి కలిసి నటించనుంది అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. 20 ఏళ్ల తర్వాత ప్రముఖ దర్శకుడు బాలా దర్శకత్వంలో సూర్య ఓ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన కీర్తిని సంప్రదించినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details