తెలంగాణలో కరోనా రెండోదశ వ్యాప్తి పెరుగుతోంది. మార్చి ఒకటో తేదీకి రాష్ట్రంలో కేవలం 1,907 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. నేటికి వాటి సంఖ్య 6,159కు పెరిగాయి. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతికి క్రియాశీల కేసులే నిదర్శంగా నిలుస్తున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 965 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఈ కేసులతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 309,741కి చేరింది. తాజాగా 312 మంది కోలుకోగా... ఇప్పటి వరకు 301,876మంది కోలుకున్నారు.
తాజాగా ఐదుగురు బలి
మరో ఐదుగురిని మహమ్మారి బలితీసుకోగా... మొత్తం మరణాలు 1676కు పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 6,159యాక్టివ్ కేసులు ఉండగా అందులో 2,622 మంది ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 254 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 59,343మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.