ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 pm - trending news

.

9 pm top news
ప్రధాన వార్తలు@9pm

By

Published : Jun 15, 2020, 8:58 PM IST

  • శాసనసభ సమావేశాలు.. కేవలం రెండే రోజులు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. కోవిడ్ దృష్ట్యా 2 రోజులు మాత్రమే వీటిని నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే గవర్నర్ ప్రసంగించనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక విడుదల

2019-20 రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను సీఎం జగన్.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'నాకు నేనుగా వెళ్లలేదు'

తాను ఏనాడూ వైకాపాలో చేరతానని అనుకోలేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆ పార్టీ నేతలు బతిమిలాడితే చేరానని చెప్పుకొచ్చారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 24 గంటల్లో 304 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. రాష్ట్రానికి చెందిన 246 మందికి పాజిటివ్​గా తేలింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అజ్ఞానం కంటే అహంకారమే ఎంతో ప్రమాదం

కరోనా నియంత్రణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మరోమారు ఆరోపించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. లాక్​డౌన్​ను ఉద్దేశించి.. 'అజ్ఞానం కంటే అహంకారమే ఎంతో ప్రమాదకరమన్న' ఐన్​స్టీన్​ మాటలను ఉదహరిస్తూ ట్వీట్​ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • '48 గంటల్లోనే ఫలితం'

కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచి, 48 గంటల్లోగా టెస్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది దిల్లీ ప్రభుత్వం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సముద్రంలో కుప్పకూలింది

అమెరికా వాయుసేన విమానం.. ఆర్​ఏఎఫ్​ లేకెన్​హీత్​ నుంచి శిక్షణ కోసం బయలుదేరింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:40గంటలకు నార్త్​ సీలో కుప్పకూలింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఎస్​బీఐ కార్డ్​ వినియోగదారులకు ఇక వీకేవైసీ

వినియోగదారుడి ఆన్​ బోర్డు ప్రక్రియను నిర్ధరించటానికి వీడియోతో కూడిన కేవైసీని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎస్​బీఐ కార్డు ప్రకటించింది. దీని ద్వారా మోసాలను తగ్గించటమే కాకుండా కేవైసీ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'జాతి వివక్ష అనే వైరస్​ను ఏ మాస్క్​ అడ్డుకుంటుంది?'

మెదడుపై ప్రభావం చూపే జాతివివక్ష అనే వైరస్​ను నివారించేందుకు ఏ మాస్క్​ అడ్డుగా నిలుస్తుందని ప్రశ్నించాడు టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ లక్ష్మీపతి బాలాజీ. ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఎందుకు ఇలా చేశావు?

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య చేసుకోవడంపై విచారం వ్యక్తం చేశారు బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్. అతను తీసుకున్న విపరీతమైన ఈ నిర్ణయం తీవ్రంగా కలచి వేసిందని వాపోయారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details