- అర్ధరాత్రి నుంచి ఏం జరిగింది?
ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని అనిశా అధికారులు నిర్ధరించారు. ఈ వ్యవహారంపై కేసులు నమోదు చేసిన అనిశా... గతంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుతో సహా ఏడుగురు ఈఎస్ఐ అధికారులను అరెస్టు చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అనుమతి నిరాకరణ
మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు జీజీహెచ్‌కు వెళ్లిన తెదేపా అధినేత చంద్రబాబుకు అక్కడి అధికారులు అనుమతి నిరాకరించారు. నిన్న అచ్చెన్న పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని.... ప్రతిష్ట కలిగిన కుటుంబంపై బురద జల్లుతున్నారని చంద్రబాబు విమర్శించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని న్యాయమూర్తి ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అనంతరం వారివురిని రెడ్డిపల్లి వద్ద ఉన్న జిల్లా జైలుకు తరలించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రాష్ట్రం@222
రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందిన 186 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 33 మందికి, విదేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 24 గంటల్లో 11,458 మందికి
భారత్‌లో కరోనా మహమ్మారి మరింత వేగంగా విస్తరిస్తోంది. తాజాగా మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 8 వేలు దాటింది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 11,458 కేసులు నమోదయ్యాయి. మరో 386 మంది కరోనాతో మృతి చెందారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కరోనా తీవ్రతపై ప్రధాని సమీక్ష