ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు@9PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు 9 PM
ప్రధాన వార్తలు 9 PM

By

Published : Jun 6, 2020, 9:14 PM IST

Updated : Jun 6, 2020, 9:21 PM IST

  • 'ఎస్​ఈసీ పునర్నియామకం'పై.. ఈ నెల 10న సుప్రీంలో విచారణ

ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పునర్నియామకం చేస్తూ.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ మీద ఈనెల 10 న సుప్రీంలో విచారణ జరగనుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • విశాఖ నౌకాదళ గూఢచర్యం కేసులో కీలక సూత్రధారి అరెస్టు

విశాఖ నౌకాదళ స్థావరం గూఢచర్యం కేసులో కీలక సూత్రధారిని ఎన్​ఐఏ అధికారులు అరెస్టు చేశారు. నిందితుని ఇంటి నుంచి సాంకేతిక పరికరాలు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కిర్గిస్థాన్​లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. ఆదుకోవాలని విజ్ఞప్తి

వైద్యవిద్యను అభ్యసించేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులు కరోనా లాక్​డౌన్ కారణంగా కిర్గిస్థాన్​లో చిక్కుకుపోయారు. తమ దుస్థితిని గమనించి రాష్ట్రానికి వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'దివ్య'మైన జీవితాన్ని.. దారి తప్పించి.. దారుణంగా చంపేశారు!

విశాఖ జిల్లా అక్కయ్యపాలెం పరిధిలోని చెక్కుడురాయిలో యువతి మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెకు ఆశ్రయం కల్పించినవారే అతి కిరాతకంగా హత్య చేసినట్లు నిర్థరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్-చైనా సైనిక అధికారుల భేటీ పూర్తి.. లేహ్​కు భారత బృందం రాక

చైనా వైపున్న చుశూల్​ మాల్డో వద్ద జరిగిన ఇరుదేశాల లెఫ్టినెంట్ జనరల్​ల సమావేశం ముగిసింది. లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం లేహ్​కు తిరిగి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణ వ్యాప్తంగా పది పరీక్షలు వాయిదా

తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పును అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఐఐటీహెచ్​ ఘనత.. తక్కువ ధరకే టెస్ట్ కిట్​ ​

అతి తక్కువ ఖర్చులో కరోనా టెస్టింగ్ కిట్​ను అభివృద్ధి చేసింది ఐఐటీ- హైదరాబాద్​. ఆర్​టీ-పీసీఆర్​ లేకుండానే పనిచేయటం దీని ప్రత్యేకత. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఐరాస గుడ్​విల్​ అంబాసిడర్​గా క్షురకుని కుమార్తె

ఇటీవల మన్​కీబాత్​లో ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించిన ఓ బాలికకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐరాస అసోసియేషన్​ ఫర్​ డెవలప్​మెంట్ అండ్ పీస్​ (యూఎన్​ఏడీఏపీ)కి గుడ్​విల్​ అంబాసిడర్​గా ఎంపికైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'ఐపీఎల్ జరగకపోతే బోర్డు పరిస్థితి దారుణమే'

ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే, బీసీసీఐపై పరిస్థితి దారుణంగా తయారవుతుందని అన్నారు బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'జోకర్' గెటప్​లో అదరగొడుతున్న స్టార్ హీరో

తనకు 'జోకర్', మనీ హైస్ట్ 'ఫ్రొఫెసర్' తరహా పాత్రలు చేయాలని ఉందంటూ యువహీరో ఆయుష్మాన్ ఖురానా చెప్పాడు. రచయితలు, దర్శకులు అలాంటి కథలతో తన దగ్గరకు రావాలని కోరాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Last Updated : Jun 6, 2020, 9:21 PM IST

ABOUT THE AUTHOR

...view details