1. సెకండ్ వేవ్: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా
రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణపై హైకోర్టు అభిప్రాయం, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక: వైకాపా అభ్యర్థి గురుమూర్తి విజయం
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి స్పష్టమైన విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థులపై గురుమూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2,70,584 ఓట్ల ఆధిక్యం సాధించారు. లెక్కించాల్సిన ఓట్ల కంటే గురుమూర్తి ఆధిక్యం ఎక్కువగా ఉంది. తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి రెండో స్థానంలో కొనసాగుతున్నారు. భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ మూడో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'నేను లోకల్' నినాదంతో మమత తీన్మార్
బంగాల్లో తృణమూల్ మరోసారి ప్రభంజనం సృష్టించింది. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. ఈ ఎన్నికలు బంగాల్ ఆత్మగౌరవానికి, బయటి వ్యక్తులకు మధ్యే అని చెప్పిన సీఎం మమతా బెనర్జీకే ఆ రాష్ట్ర ప్రజలు పట్టంగట్టారు. నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన దీదీ ఓడినప్పటికీ.. బంగాల్ వ్యాప్తంగా తృణమూల్ హవా కొనసాగింది. ఈ విజయానికి కారణాలేంటి ? మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొని టీఎంసీ చారిత్రక విజయం ఎలా సాధించింది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'నందిగ్రామ్ గురించి చింతించొద్దు.. తీర్పు ఏదైనా ఓకే'
నందిగ్రామ్ గురించి చింతించొద్దని ప్రజలకు సూచించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అక్కడి ప్రజల తీర్పును అంగీకరిస్తామన్నారు. ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. చెదిరిన భాజపా 'బంగాల్' స్వప్నం.. కానీ...
'మిషన్ బంగాల్'లో భాజపా డీలా పడింది. తృణమూల్ కాంగ్రెస్‌కే మరోసారి అధికారం దక్కింది. కానీ ఈ ఎన్నికల్లో కమలదళం భారీగా పుంజుకుంది. బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరకపోవడం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసే విషయమే. మరి ఇందుకు కారణాలేంటి? భాజపా తదుపరి వ్యూహాలేంటి ?పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.