- తన ఫోన్ ఎత్తటంలేదని మహిళ గొంతు కోసిన ఉన్మాది !
తన ఫోన్ ఎత్తటంలేదన్న కోపంతో ఓ యువకుడు బ్లేడుతో మహిళ గొంతు కోసిన దారుణ ఘటన నెల్లూరు జిల్లా రేబాల గ్రామంలో చోటుచేసుకుంది. ఘటనకు వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- live video: బార్లో స్నేహితుడిపై దాడి.. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు
live video: మద్యం సేవిస్తుండగా తలెత్తిన వాగ్వాదం ఇద్దరి స్నేహితుల మధ్య గొడవకు దారితీసింది. నవీన్, చక్రి ఇద్దరు స్నేహితులు. తెలంగాణలోని సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బార్‌కు వెళ్లారు. ఇద్దరు మద్యం సేవిస్తుండగా మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో నవీన్‌పై చక్రి మద్యం సీసాలతో దాడి చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- New Judges: రాష్ట్ర హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు
రాష్ట్ర హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. ఏడుగురు న్యాయాధికారులకు హైకోర్టు జడ్జిలుగా కొలీజియం పదోన్నతి కల్పించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Rape Attempt: బాలికపై ముగ్గురు అత్యాచారయత్నం... ఎక్కడంటే..?
Rape Attempt: రోజురోజుకు ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేదు. అడపిల్ల అయితే చాలు.. మృగాళ్లలా మీదపడిపోతున్నారు కొందరు. తాజాగా నంద్యాల జిల్లాలో ఓ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి యత్నించారు. తప్పించుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రోజూ ఇవి ఎలా తినగలం సారూ?'.. మాడిన రొట్టెలపై కోర్టులో ఖైదీ ఫిర్యాదు
జైలులో పెట్టే ఆహారం తినలేక ఇబ్బందులు పడుతున్న ఆ ఖైదీ అక్కడి అధికారులకు చాలా సార్లు ఫిర్యాదు చేశాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోవడం వల్ల విసుగెత్తిపోయిన అతను.. ఉన్నతాధికారుల దృష్టికి ఎలాగైనా తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే కోర్టు విచారణ రోజు తను తినే ఆహారాన్ని కూడా పార్సిల్ తీసుకెళ్లాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే..
JEE Main PostPoned: జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త పరీక్ష తేదీలను బుధవారం ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ. జులై 25 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సిద్ధూ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్.. ఇద్దరు మృతి
సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితుల్లో ఇద్దరు.. పోలీసులతో ఎన్కౌంటర్లో మరణించారు. నిందితుల ఉన్న ప్రాంతానికి చేరుకోగా వారు కాల్పులకు తెగబడ్డారని, ఎదురుకాల్పుల్లో వారు హతమయ్యారని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లంక మహిళల దుస్థితి.. అన్నం, మందుల కోసం శరీరాన్ని అమ్ముకుంటూ..!
Srilanka Women: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న ద్వీపదేశం శ్రీలంకలో దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా జౌళి పరిశ్రమ కొనుగోళ్లు లేక వెలవెలబోయింది. దీంతో ఈ రంగంలో పనిచేసే వేలాది మంది మహిళలు ఉపాధి కోల్పోతామన్న భయంతో ఇతర రంగాల్లో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. కానీ ఎక్కడా.. ఉపాధి లభించక వేశ్యల్లా మారి ఆహారం, ఔషధాలకు డబ్బుల్లేక తమ దేహాలను తాకట్టుపెడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ICC Rankings: దూసుకెళ్లిన హార్దిక్, పంత్.. కోహ్లీ, బుమ్రా డౌన్
ICC ODI rankings: ఐసీసీ.. తాజా వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో టీమ్ఇండియా ప్లేయర్స్ కోహ్లీ, బుమ్రా ర్యాంకుల్లో కిందకు పడిపోగా.. హార్దిక్, పంత్ మాత్రం దూసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Oo Antava song: మరోసారి రెచ్చిపోయిన సామ్.. ఆ స్టార్ హీరోతో చిందులు
Samantha Akshay kumar Oo antava song: దేశవ్యాప్తంగా ఊర్రూతలూగించిన 'ఊ అంటావా మావ' సాంగ్‌కు మరోసారి చిందులేసి అభిమానుల్ని అలరించింది హీరోయిన్ సమంత. బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్‌తో కలిసి ఈ పాటకు చిందులేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 7 PM