- APCRDA: 'అసంపూర్తిగా ఉన్న పనులు దశల వారీగా పూర్తి చేస్తాం'
APCRDA on Works at Amaravati: రాజధానిలో అసంపూర్తిగా ఉన్న పనులను దశల వారీగా పూర్తి చేస్తామని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. రాజధానిలోని ఆ నాలుగు గ్రామాల్లో రైతులకు ఇచ్చిన ప్లాట్లలో చేపట్టే అభివృద్ధి పనులకు కమిషనర్ పూజలు చేసి ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొనటం సంతోషంగా ఉంది: చిరంజీవి
స్వాతంత్య్రం కోసం తెల్లవారిని ఎదిరించిన ధీరుడిగా.. అల్లూరి సీతారామరాజు చిరస్థాయిగా నిలిచిపోయారని కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కొనియాడారు. మన్యంవీరుడు అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాపట్ల జిల్లాలో దారికి అడ్డుగా ఉన్న గోడను తొలగించిన అధికారులు
Bapatla News: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో తలెత్తిన దారి వివాదంలో.. అడ్డుగా ఉన్న గోడను కొంతమేర తొలగించారు. గోడను పడగొడుతున్న క్రమంలో పలువురు మహిళలు అడ్డకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అంతకుముందు ఇరువురిని గ్రామ సచివాలయం వద్ద కూర్చోబెట్టి రాజీకి అధికారులు ప్రయత్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'జులాయి' సీన్ రిపీట్ చేశారు.. బ్యాంకునే దోచేశారు!
Bank theft: సినిమాల్లో మంచీ మర్యాదా.. నీతీ నిజాయితీ.. ఎంత మంది నేర్చుకుంటున్నారో తెలియదుగానీ.. చెడ్డ పనులను మాత్రం పొల్లు పోకుండా బుర్రలో స్టోర్ చేసుకుంటున్నారు! అంతేనా.. వాటిని రిహార్సల్ చేసి, అమల్లో పెట్టేస్తున్నారు కూడా! మొన్నీమధ్య.. గంధపుచెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప సినిమాలో.. స్మగ్లర్లకు బోలెడు ఐడియాలు దొరికాయి. వాటిని ఫాలో అయిన గంజాయి, డ్రగ్స్ ముఠాలు పట్టుబడ్డాయి కూడా! తాజాగా.. మరో ముఠా ఏకంగా బ్యాంకుకే కన్నం వేసింది. దీనికి జులాయి సినిమాను ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది.. ఆ చోరీ తతంగం మొత్తం చూసిన తర్వాత! ఆ సీన్ రీ-కన్సట్రక్షన్.. మీకోసం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. సోనూసూద్ మ్యాజిక్‌తో చౌముఖికి కొత్త లైఫ్
కరోనా కష్టకాలంలో దేశవ్యాప్తంగా వందలాది మంది పేదలకు తన వంతు సాయం చేసి.. కీర్తి గడించిన నటుడు సోనూసూద్. తాజాగా ఆయన మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. నాలుగు కాళ్లు, చేతులతో జన్మించిన ఓ చిన్నారికి ముంబయిలో చికిత్స చేయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాలుడిని నదిలోకి లాక్కెళ్లిన మొసలికి ఎక్స్‌రే.. రిపోర్ట్స్ చూస్తే...
13 ఏళ్ల బాలుడు నది దాటుతుండగా ఓ మొసలి లోపలకు లాగేసింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ ఉద్ధమ్‌సింగ్ నగర్ జిల్లాలో జరిగింది. గాలింపు చర్యలు చేపట్టినా బాలుడి ఆచూకీ లభించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మొసలిని పెళ్లాడిన 'మేయర్'.. గ్రాండ్‌గా పార్టీ.. ప్రజల కోసమేనట!
Mayor marries alligator: సంప్రదాయ దుస్తులు, మేళతాళాలు, అతిథుల కోలాహలం మధ్య మెక్సికోలోని ఓ గ్రామంలో జరిగిన వివాహం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. వరుడు ప్రజాప్రతినిధి కాగా.. వధువు మొసలి కావడమే ఇందుకు కారణం. ఇంతకీ ఎందుకిలా? ఈ మకర వివాహం వెనుక మర్మమేంటి?పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హోటల్స్, రెస్టారెంట్స్ సర్వీస్ ఛార్జ్ విధించడంపై బ్యాన్
Service charge in restaurant: హోటల్, రెస్టారెంట్ బిల్లో సర్వీస్ ఛార్జ్ చూసి షాకయ్యారా? ఎందుకు కట్టాలని అక్కడి సిబ్బందితో వాదించి విసుగెత్తిపోయారా? చివరకు చేసేదేమీ లేక వారు చెప్పినంత బిల్ చెల్లించి వచ్చేశారా? ఇకపై అలా కుదరదు. కొత్త రూల్స్ ప్రకారం.. సర్వీస్ ఛార్జ్ విధించడం నిషిద్ధం. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేయాలో తెలుసుకునేందుకు పూర్తి కథనం చదవండి.
- ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రా మరో రికార్డు
IND VS ENG Bumrah record: టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ బుమ్రా.. మరో ఘనత సాధించాడు. ఇంగ్లాడ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రాక్షసుడైనా, భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే'.. కల్యాణ్‌రామ్ పవర్ఫుల్ ట్రైలర్
కల్యాణ్‌రామ్ హీరోగా రూపొందుతున్న 'బింబిసార' సినిమా ట్రైలర్ సోమవారం విడులైంది. యుద్ధ విన్యాసాలు, అదిరిపోయే సంభాషణలతో.. కల్యాణ్‌రామ్ కొత్త లుక్‌లో కనిపిస్తున్న సినిమా ట్రైలర్ ఎలా ఉందో మీరూ చూసేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 7 PM