- పాఠశాలల పునఃప్రారంభ తేదీ మారింది.. ఎప్పుడంటే..!
రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం జూలై 4న తెరుచుకోవాల్సిన బడులు జూలై 5న తెరుచుకోనున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరికి ఘన నివాళి అర్పించేందుకు ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తుండటంతో పాఠశాలల పునః ప్రారంభ తేదీని వాయిదా వేశారు.
- 'రాష్ట్ర ప్రభుత్వం రూ.7,660 కోట్ల పంచాయతీ నిధులను దొంగిలించింది'
రూ. 7,660కోట్ల పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకు ఇవ్వకుండా దారి మళ్లించిందని పేర్కొంటూ.. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాశారు.
- ప్రకృతి వైద్యం.. ఎలాంటి మందులు లేకుండా దీర్ఘకాలిక సమస్యలకు చెక్
సమస్త జీవనానికి మూలం ప్రకృతి. అక్కడి నుంచి ఉద్భవించిందే మానవ జీవనం. కాలక్రమేణా.. మారుతున్న జీవన విధానం, ఆహార అలవాట్ల వల్ల కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కొంతవరకు ఆధునిక వైద్యం అరికట్టినా.. ప్రకృతికి వాటిని ఎలా నివారించాలో తెలుసు.
- సమస్యలపై నిలదీసిన ప్రజలు.. ఎమ్మెల్యే తిరుగుముఖం
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు చేదు అనుభవం ఎదురైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కేవీబీపురం మండలం బ్రాహ్మణపల్లికి వెళ్లిన ఎమ్మెల్యేని వివిధ సమస్యలపై స్థానికులు నిలదీశారు.
- గేమ్ పేరిట బాలుడికి వల.. అమ్మనాన్నల ఫోన్లు హ్యాక్.. ఆ ఫొటోలు తీయించి...
సైబర్ హ్యాకర్ల ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా జైపుర్‌లో 13 ఏళ్ల బాలుడిని ట్రాప్ చేసిన హ్యాకర్.. అతనితో అసభ్యకర పనులు చేయించాడు. ఇంతకీ ఆ చిన్నారి సైబర్ ఉచ్చులో ఎలా చిక్కుకున్నాడు? ఆ తర్వాత ఏమైంది?
- అప్పుడు రిక్షావాలా.. ఇప్పుడు 'మహా' కింగ్ మేకర్! ఎవరీ శిందే? ఎందుకిలా?
మహారాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించారు శివసేన ఎమ్మెల్యే ఏక్నాథ్ శిందే. గడిచిన రెండుమూడేళ్లుగా రగులుతున్న అసంతృప్తిని వెళ్లగక్కుతూ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
- రూ.10 నాణేలతో కారు కొనుగోలు- ఆ న్యూస్ ఫేక్ అని చెప్పేందుకేనట!
"రూ.10 నాణేల చెల్లవు"... ఇదేదో కేేంద్ర ప్రభుత్వమో, రిజర్వ్ బ్యాంకో ఇచ్చిన స్టేట్మెంట్ కాదు. తమిళనాడులోని ధర్మపురి వాసులు పుట్టించిన పుకారు ఇది. ఈ వదంతును పోగొట్టడానికి ఓ వ్యక్తి పెద్ద యుద్ధమే చేశాడు. చివరకు ఓ వినూత్న ప్రయోగంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
- మాంద్యం వస్తే ఏం చేయాలి? ఆర్థిక భద్రతకు ఎలా సన్నద్ధమవ్వాలి?
కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడి మాంద్యం ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రేట్ల పెంపు వల్ల మాంద్యం తప్పదని చరిత్ర కూడా చెబుతోంది. 2009 ఆర్థిక మాంద్యం సమయంలోనూ చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు.
- టాప్ 10లో భారత్ నుంచి స్మృతి మంధాన మాత్రమే!
మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). టాప్ 10 బ్యాటర్ల జాబితాలో టీమ్ఇండియా నుంచి స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మాత్రమే నిలిచింది.
- ప్రముఖ నటుడికి తీవ్ర గాయాలు.. గోవా బీచ్‌లో జంప్ చేస్తుండగా..
ప్రముఖ కన్నడ హీరో దిగంత్ గాయపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి గోవా వెళ్లగా.. అక్కడ ఆయనకు ప్రమాదం జరిగింది.