- ఎమ్మెల్సీ అనంతబాబు తరలింపుపై గోప్యత పాటిస్తున్న పోలీసులు..
MLC ANANTHA: కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు తరలింపుపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. అనంతబాబు తరలింపు విషయంలో ఎలాంటి సమాచారాన్ని పోలీసులు ఇవ్వడం లేదు. సర్పవరం అతిథిగృహానికి అనంతబాబును తరలిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 40 ఏళ్ల ప్రస్థానం చాటేలా.. భవిష్యత్ ప్రయాణాన్ని నిర్దేశించేలా మహానాడు: చంద్రబాబు
TDP Mahanadu: నలభై ఏళ్ల ప్రస్థానం చాటేలా.. భవిష్యత్ ప్రయాణాన్ని నిర్దేశించేలా మహానాడు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మహానాడు నిర్వహణ కమిటీలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. ప్రజల స్పందన చూస్తుంటే ఈసారి ప్రభంజనంలా మహానాడు ఉండబోతోందన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సిరివెన్నెల అక్షర కిరణాలు.. అందరిలో స్ఫూర్తినింపుతాయి : పవన్
Pawan on Sirivennela: సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికంగా లేకపోయినా ఆయన సమాజానికి అందించిన అక్షర కిరణాలు అందరిలో స్ఫూర్తి నింపుతాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం' చూశాక 'రుద్రవీణ' చిత్ర విశేషాలను ఆయన గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల రచనల్లో ఆయనలోని సామాజిక బాధ్యత ప్రస్ఫుటమవుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మహిళల పాలిట 'వైకాపా' పాలన శాపంగా మారింది - అనిత
TDP ANITHA: రాష్ట్రంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా పాలన మహిళల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తుపాకులతో ఎన్నికల ప్రచారం.. జనం హడల్.. వీడియో వైరల్
తుపాకులు చేతపట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంఘటన ఝార్ఖండ్, సాహిబ్‌గంజ్ జిల్లాలోని ముఫస్సిల్ స్టేషన్ పరిధిలో కొద్ది రోజుల క్రితం జరిగింది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో సునీల్ యాదవ్ అనే అభ్యర్థి ఈ ప్రచారం నిర్వహించారు. తుపాకులతో గ్రామాల్లో తిరుగుతున్న వీడియోను భాజపా నేత బాబులాల్ మరాండీ ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విదేశాల్లో చదవాలనుందా..? చండీగఢ్ యూనివర్సిటీలో చేరండి!
విదేశాల్లో చదువుకోవాలనే కలలు కనే విద్యార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది చండీగఢ్ యూనివర్సిటీ. డ్యుయల్ డిగ్రీలో భాగంగా అంతర్జాతీయ ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకునేందుకు తమ విద్యార్థులను పంపుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'భారత్, జపాన్ దోస్తీ ఎంతో స్పెషల్'
PM Modi Japan Tour: భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ పెట్టుబడులు ముఖ్యమైన పాత్ర పోషించాయని ప్రధాని మోదీ అన్నారు. రెండురోజుల జపాన్ పర్యటనలో ఉన్న మోదీ.. సోమవారం ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. మరోవైపు జపాన్‌కు చెందిన 30పైగా దిగ్గజ వ్యాపార సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, సీఈఓలతో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడి అవకాశాలను వారికి వివరించారు మోదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మార్కెట్లోకి 'హ్యుందాయ్' కొత్త కారు - ధర, ఫీచర్లు ఇలా..
Hyundai New Edition: ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్స్ మరో వాహనాన్ని విపణిలోకి తీసుకొచ్చింది. సరికొత్త హంగులతో గ్రాండ్ ఐ10 NIOS ఎడిషన్‌ను విడుదల చేసింది. దాని ధర ఎంతంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నా అంతిమ లక్ష్యం అదే: ప్రపంచ ఛాంపియన్ నిఖత్
World Boxing championship Nikhat Zareen: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన తెలుగు తేజం బాక్సర్ నిఖత్ జరీన్.. తన అంతిమ లక్ష్యం ఏంటో చెప్పింది. ఆడపిల్లలు క్రీడారంగంలో బాగా రాణిస్తూ దేశం గర్వపడేలా చేస్తున్నారని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అర్జునుడుగా మహేశ్.. టీచర్‌గా అల్లరినరేశ్.. నాని కష్టాలు!
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో మహేశ్‌బాబు, ధనుశ్, అల్లరినరేశ్, నాని సినిమాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధానవార్తలు @ 7 PM