ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM - తెలుగు తాజా వార్తలు

.

7pm top news
టాప్ న్యూస్

By

Published : Jun 5, 2020, 7:01 PM IST

  • 7 సెంట్ల స్థలమే కారణం

విజయవాడ గ్యాంగ్​వార్​కు యనమలకుదురులోని 7 సెంట్ల స్థలమే వివాదానికి కారణమని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేశామనీ, త్వరలో మరికొందరిని అరెస్టు చేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మరో ఎమ్మెల్యే అసంతృప్తి

కొత్తపేట వైకాపా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇసుక సరఫరాలో ఏపీఎండీసీ విఫలమైందని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చెప్పేదొకటి... చేసేదొకటి

వైకాపా ప్రభుత్వం చెప్పిన వాటికి, చేసే పనులకు పొంతన లేదని.. తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిపై యూటర్న్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • ఔను వాళ్లిద్దరూ కొట్టుకున్నారు!

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరికొకరం తోడుండాలంటూ ప్రమాణాలు ఇచ్చుకున్నారు. ఇద్దరి మధ్య వచ్చిన గొడవ పెద్దదవటంతో కొట్టుకున్నారు.ఆ తరువాత ఏమయ్యిందంటే..

  • ఆ వార్తలు నమ్మెుద్దట

కేరళలో గర్భంతో ఉన్న ఏనుగును ఆహారం ఆశ చూపి పేలుడు పదార్థాలతో చంపారన్న వార్తలను నమ్మొద్దని పేర్కొంది ఆ రాష్ట్ర అటవీ శాఖ​. అది కేరళను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నమని తెలిపింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • శ్వేతవర్ణ కొండచిలువ!

అరుదైన కొండచిలువ కర్ణాటకలోని ఓ ఇంట్లో దర్శనమిచ్చింది. దాన్ని చూసి ఆందోళనకు గురైన ఇంటి సభ్యులు.. పాములను పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చైనా దూకుడు

భారత్​తో చర్చలు జరుపుతామంటూనే చైనా దూకుడుగా ప్రవర్తిస్తోంది. శనివారం ఇరుదేశాల సైనికాధికారుల భేటీకి ముందు సరిహద్దులోని పశ్చిమ కమాండ్​కు కొత్త సారథిని నియమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లింకేంటి?

యావత్ అమెరికా జాత్యహంకార వ్యతిరేక నినాదాలతో హోరెత్తుతోంది. ఈ నిరసనల్లో కొద్ది రోజులుగా 8:46 అనే సంఖ్యకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. ఫ్లాయిడ్​ మృతికి, నిరసనలకు.. ఆ సంఖ్యతో ఎందుకు ముడిపెడుతున్నారు?

  • అందుకే ధోనీ రావటం లేదు

సోషల్ మీడియాలోకి మహీ ఎందుకు రావట్లేదు? దూరంగా ఉండటానికి గల కారణాన్ని ధోనీ సతీమణి చెప్పేసింది. మీరూ తెలుసుకోండి.

  • వలస కూలీలకు సోనూసూద్ హెచ్చరిక

తన పేరు చెప్పి కొందరు వ్యక్తులు మోసం చేయాలని చూస్తున్నారని, నటుడు సోనూసూద్ వలసకూలీలను హెచ్చరించారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details