రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 46,712 నమూనాలను పరీక్షించగా వారిలో 7,895 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,53,111కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు నమోదు చేసిన వివరాలను అందులో పేర్కొంది. ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 93 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో కొత్తగా 7895 కరోనా కేసులు...93 మరణాలు - కరోనా వైరస్ వార్తలు
corona-positive-cases
16:56 August 23
రాష్ట్రంలో కొత్తగా 7895 కరోనా కేసులు...93 మరణాలు
చిత్తూరులో 11, అనంతపురం 3, నెల్లూరు 16, తూర్పుగోదావరి 4, కడప 8, కర్నూలు 10, గుంటూరు 3, విశాఖపట్నం 5, శ్రీకాకుళం 6, కృష్ణా 3, విజయనగరంలో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 3,282కి చేరింది. మరోవైపు ఇప్పటి వరకు రాష్ట్రంలో 32,38 లక్షల పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
ఇదీ చదవండి
Last Updated : Aug 23, 2020, 5:21 PM IST