ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7pm - ఏపీ ప్రధాన వార్తలు

.

7 pm top news
ప్రధాన వార్తలు @ 7pm

By

Published : Aug 2, 2020, 7:04 PM IST

  • ఆగని విజృంభణ
    రాష్ట్రంలో కొత్తగా 8,555 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో మరో 67 మంది మృతి చెందారు. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,764కు చేరాయి.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే'
    రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వ తీరును జనసేనాని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు'
    ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని సమర్ధించిన జగన్... ముఖ్యమంత్రి అయ్యాక మూడు రాజధానులు అనడం ఏంటని మాజీమంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'భయంగా ఉంది'
    విశాఖ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్​​(విమ్స్​)లో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నా వైద్య సిబ్బంది పట్టించుకోవటం లేదంటూ అక్కడ చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అమిత్ షాకు కరోనా పాజిటివ్
    కొవిడ్‌ మహమ్మారికి సామాన్యులే కాకుండా పలువురు మంత్రులు, ప్రముఖులు బలవుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన ఆస్పత్రిలో చేరనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ప్రపంచానికి చాటిచెప్పండి'
    మహాకావ్యం రామాయణంలోని ధర్మాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ప్రపంచం మొత్తానికి ఆ సందేశాన్ని వ్యాప్తి చేయాలని కోరారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • నిలకడగా సోనియా ఆరోగ్యం
    సాధారణ వైద్య పరీక్షల కోసం దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిశ్చార్జ్​ అయ్యారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అవే మార్కెట్లకు కీలకం !
    రెపో రేటుపై ఆర్​బీఐ నిర్ణయం, జులై నెల ఆర్థిక గణాంకాలు, వాహన విక్రయాల లెక్కలు సహా అనేక అంశాలు ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. దిగ్గజ సంస్థలు ఎయిర్​టెల్, టాటా స్టీల్​ ఈ వారమే క్యూ1 ఫలితాలు ప్రకటించనున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ఐపీఎల్​తో ఉపయోగం లేదు'
    ఐపీఎల్​, ధోనీ కెరీర్​కు ఏమాత్రం ఉపయోగపడదని అన్నాడు మాజీ బౌలర్ నెహ్రా. భారత్​ తరఫున మహీ చివరి మ్యాచ్​ ఎప్పుడో ఆడేశాడని చెప్పాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కరోనాను జయించిన బిగ్​బీ
    దాదాపు మూడువారాల పాటు కరోనాతో పోరాడిన బాలీవుడ్​ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఎట్టకేలకు కోలుకున్నారు. నానావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని చెబుతూ ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details