ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణపై కరోనా పంజా..కొత్తగా 6,551 కేసులు - తెలంగాణలో కరోనా మరణాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,551 మంది వైరస్ బారిన పడగా.. మహమ్మారితో 43 మంది మృతి చెందారు.

telangana covid cases
తెలంగాణ కరోనా కేసులు

By

Published : Apr 26, 2021, 12:56 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 6,551 మందికి పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. వైరస్‌ బారిన పడి ఒక్కరోజే అత్యధికంగా 43 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65,597 క్రియాశీల కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొని మరో 3,804 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,418 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో యాంటీజెన్‌ కిట్‌ల కొరతతో టెస్టులు రోజురోజుకు తగ్గుతున్నాయి. 24 గంటల్లో కేవలం 73,275 మందికి మాత్రమే పరీక్షలు చేశారు. వీటిలో ప్రభుత్వాసుపత్రుల్లో కేవలం 58,626 మందికి మాత్రమే కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చూడండి:విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో విషాదం.. ఇద్దరు కొవిడ్ రోగులు మృతి

ABOUT THE AUTHOR

...view details