corona cases:రాష్ట్రంలో కొత్తగా 624 కరోనా కేసులు, 4 మరణాలు - ap corona latest news
17:26 October 10
corona cases
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38,312 పరీక్షలు నిర్వహించగా.. 624 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,57,252 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ కారణంగా నలుగురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,254కి చేరింది. 810 మంది కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,35,054కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,944 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,87,44,941 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
ఇదీ చదవండి:అక్కడి రోడ్లు అంబులెన్స్ వేగాన్నే నియంత్రించేంత ఛిద్రం..!