కరోనా రెండో దశలో తెలంగాణలోని 600 మందికిపైగా ఎస్బీఐ ఉద్యోగులు కరోనా బారినపడినట్లు హైదరాబాద్ సర్కిల్ సీజీఎం ఓం ప్రకాశ్ మిశ్రా తెలిపారు. కొవిడ్ కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రేపటి నుంచి సగం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో పని చేయనున్నారని సీజీఎం ఓం ప్రకాష్ మిశ్రా వెల్లడించారు. మొత్తం 12,500 మంది ఉద్యోగుల్లో మొదటి దశలో 2,200 మంది, రెండో దశలో ఇప్పటి వరకు 600 మంది కరోనా బారిన పడ్డారని పేర్కొన్నారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులకే ఎక్కువగా కొవిడ్ సోకిందని తెలిపారు.
రేపటి నుంచి..
ఇప్పటి వరకు వంద బ్యాంకు శాఖల ఉద్యోగులు ఎక్కువ మంది కరోనా బారిన పడడం వల్ల.. ఆయా బ్రాంచీలను రెండు, మూడు రోజులపాటు మూసివేసి తిరిగి తెరిచామన్నారు. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు.. రేపటినుంచి ఏప్రిల్ 30 వరకు సగం మంది సిబ్బందితోనే బ్యాంకులు పని చేస్తాయని తెలిపారు.
ఇదీ చూడండి:కరోనా తగ్గాక.. 'వహ్ తాజ్' అనాల్సిందే..