- గోరంట్ల మాధవ్ వీడియో నిజమైనదేనని చెప్పిన ఫోరెన్సిక్ రిపోర్ట్
Forensic report on MP Gorantla video ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో నకిలీది కాదని, నిజమైనదేనని అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధరించిందని తెదేపా నేతలు స్పష్టం చేశారు. తెదేపా తరఫున ఈ వీడియోను ప్రైవేటుగా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని.. అందులో మార్ఫింగ్ జరగలేదని ల్యాబ్ నిపుణుడు నివేదిక ఇచ్చినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Health cards ప్రభుత్వ ఉద్యోగులకు ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యసేవలు
Health cards ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ తరహాలోనే ఇతర రాష్ట్రాల్లో వైద్య సేవలు పొందేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా ఉద్యోగులు వైద్యం పొందొచ్చు. మెడికల్ బిల్లులు సమర్పించిన 21 రోజుల్లోనే ఆటోడెబిట్ ద్వారా చెల్లింపులకు ఆంగీకారం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CBN on Visakha roads రోడ్లపై మనుషులు చనిపోతుంటే ప్రభుత్వం నిద్రపోతోందా
CBN on Visakha road Incident విశాఖలో రోడ్డుపై ఉన్న గుంత కారణంగా ఓ వ్యక్తి మరణించిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల దుస్థితి చూడలేక చివరికి సామాన్యులే గుంతలను పూడ్చాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Minister Amarnath నన్ను రెడ్డిగా మార్చకండి మంత్రి అమర్‌నాథ్ సూచన
Minister Amarnath తనను రెడ్డిగా మార్చకండని పరిశ్రమల ప్రతినిధులకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. అవగాహనలేక తిరుపతిలో అపాచీ కంపెనీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో కంపెనీ సీఈఓ, జపాన్ ప్రతినిధులు అందరూ అమర్‌నాథ్‌రెడ్డిగానే సంబోధించి మాట్లాడారని గుర్తుచేశారు. టైర్ల కంపెనీ ప్రారంభోత్సవంలో మళ్లీ ఈ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మళ్లీ కరోనా
Sonia Gandhi Corona News కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మళ్లీ కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కశ్మీర్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన
World highest railway bridge అందమైన కశ్మీర్ లోయలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జితో పర్యాటకంగా హిమాలయ కొండలు మరింత సుందరంగా మారనున్నాయి. ఈ నిర్మాణంతో కశ్మీర్ లోయకు అనుసంధానం మరింత సులభం కానుంది. ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైన ఈ వంతెన విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హోటల్‌కు పిలిచి మహిళపై అత్యాచారం చేసిన వ్యాపారి
వ్యాపార విషయమై చర్చిద్దామంటూ ఫైవ్ స్టార్ హోటల్‌కు పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యాపారవేత్త. ఈ దారుణ ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వృద్ధి పథంలో ఆర్థిక రథం త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి
India economy after independence మన ఐటీ ఔషధ వాహన రంగాలు దూసుకెళుతున్న తరుణంలో ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తోందనే ఆశలు రేకెతున్నాయి. స్వావలంబన దిశగా పయనమవుతుండగా అదే సమయంలో పేదరికం నిరుద్యోగం సమస్యలు భారత్‌ను వెంటాడుతున్నాయి. ఈ స్వాతంత్య్ర అమృత మహోత్సవాల వేళ మన ఆర్థిక రంగ ప్రగతి ప్రస్థానాలపై ప్రత్యేక కథనం పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కామన్వెల్త్ పతకవిజేతలు దేశాన్ని గర్వించేలా చేశారని మోదీ ప్రశంసలు
Commonwealth Games PM Modi కామన్వెల్త్ క్రీడల పతకవిజేతలకు ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. వారితో కలిసి ముచ్చటించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత అథ్లెట్లు చారిత్రక ప్రదర్శన చేసి దేశం గర్వించేలా చేశారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభాస్ సలార్ అప్డేట్ మరో రెండు రోజుల్లో
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ సలార్. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను మేకర్స్ మరో రెండు రోజుల్లో ఇవ్వనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5PM ప్రధాన వార్తలు