ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news

..

AP TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM
author img

By

Published : Jun 6, 2022, 5:01 PM IST

  • JP Nadda: రైతులకు మోదీ చేస్తున్న సాయాన్ని.. జగన్ సొంత పథకంగా చెప్పుకుంటున్నారు: జేపీ నడ్డా
    JP Nadda AP Tour: వైకాపా ప్రభుత్వంపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు.. కరెంటు కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు మోదీ అందించే సాయాన్ని జగన్ సొంత పథకంగా చెబుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి భాజపా అవసరం చాలా ఉందని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CM REVIEW: సమగ్ర సర్వేతో.. భూవివాదాలన్నీ పరిష్కారమవుతాయి: సీఎం జగన్
    CM REVIEW: సమగ్ర సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సీఎం సమీక్షించారు. సమగ్ర సర్వేతో భూవివాదాలన్నీ పరిష్కారమవుతాయని అన్నారు. ఇప్పటివరకూ జరిగిన సర్వే ప్రగతిని సీఎం పరిశీలించారు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మా కుటుంబంపై కక్షతోనే సీఐడీ నోటీసులు: గౌతు శిరీష
    Gouthu Sirisha: సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు తెదేపా నాయకురాలు గౌతు శిరీషకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరయ్యే ముందు తన న్యాయవాదులతో కలిసి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. తనకు జారీ చేసిన నోటీసుల్లో ఎలాంటి వివరాలు పొందుపరచలేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ATTACK: విజయవాడలో రెచ్చిపోయిన వైకాపా కార్పొరేటర్​ వర్గీయులు.. పార్క్​ సిబ్బందిపై దాడి
    ATTACK: విజయవాడ భవానీపురంలోని బెరంపార్కులో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. కార్పొరేటర్‌ చైతన్యరెడ్డి వర్గీయులు బెరంపార్కులో ఫొటోషూట్‌ చేస్తుండగా డబ్బులు కట్టాలని.. ప్రశ్నించిన ఏపీ టూరిజం సిబ్బందిపై దాడి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యూనివర్సిటీల ఛాన్సలర్​గా మమత.. గవర్నర్ అధికారాలు కట్
    Mamata Banerjee news: బంగాల్​లో కీలక పరిణామం జరిగింది. విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్​గా వ్యవహరిస్తున్న గవర్నర్ స్థానంలో.. ముఖ్యమంత్రిని ఛాన్సలర్​ను చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ ఇద్దరికీ తెలియకుండా ఆమెకు మూడో పెళ్లి.. న్యాయం కోసం భర్తల పోరాటం!
    మధ్యప్రదేశ్​కు చెందిన ఓ యువతి ఇద్దరు భర్తలను మోసం చేసి మూడో భర్తతో వెళ్లిపోయింది. ప్రేమిస్తున్నానని చెప్పిన యువతి ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసం చేసిన ఈ ఘటన మహారాష్ట్ర నాగ్​పుర్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మీలా మతోన్మాదులకు స్మారకాలు కట్టట్లేదు'... పాక్​పై భారత్ ఫైర్
    భారత్​లోని ముస్లింల హక్కులపై పాకిస్థాన్, సౌదీ అరేబియా, ఇస్లామిక్ సహకార సంస్థ(ఐఓసీ) చేసిన వ్యాఖ్యలను విదేశాంగ శాఖ ఖండించింది. ఈ సందర్భంగా పాకిస్థాన్​పై తీవ్రంగా మండిపడింది. భారత్​లో అన్ని మతాలకు గౌరవం లభిస్తుందని.. పాకిస్థాన్​లా మతోన్మాదులకు తాము స్మారకాలు కట్టడం లేదని ఎద్దేవా చేసింది. పాక్ ముందుగా.. తమ దేశంలోని పరిస్థితులపై దృష్టిసారించాలని హితవు పలికింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బోరిస్​కు 'పార్టీగేట్'​ చిక్కులు.. సొంత పార్టీ నుంచే అవిశ్వాస తీర్మానం!
    పార్టీగేట్‌ కుంభకోణంపై ఇంటా, బయటా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సొంత పార్టీ కన్సర్వేటివ్‌ సభ్యులే నిర్ణయించారు. ఈ తీర్మానం వీగిపోయే అవకాశాలు ఉన్నా ఆయన నాయకత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని భావిస్తున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఠాగూర్​, కలాం ఫొటోలతో కరెన్సీ నోట్లు!'.. ఆర్​బీఐ క్లారిటీ
    దేశంలోని కరెన్సీ నోట్లపై ఠాగూర్​, అబ్దుల్​ కలాం చిత్రాలను ముద్రించే అంశంపై స్పష్టత ఇచ్చింది భారతీయ రిజర్వ్​ బ్యాంకు. అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కుండబద్దలు కొట్టింది. కరెన్సీ నోట్ల మార్పు వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సల్మాన్​ ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు.. భద్రత కట్టుదిట్టం
    Salman Khan: హత్యా బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్​ ఖాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు ముంబయి పోలీసులు. ఈ మేరకు సోమవారం అతడి ఇంటి వద్దకు చేరుకొని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details