ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @5PM - ఏపీ ముఖ్యవార్తలు

...

5pm top news
5pm top news
author img

By

Published : May 14, 2022, 4:58 PM IST

  • 'ఆఫ్ బడ్జెట్ అప్పులపై.. ఆ వివరాలివ్వండి'

రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, సంస్థలు, సొసైటీలు తీసుకున్న ఆఫ్ బడ్జెట్‌ అప్పులపై వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని.. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం కోరింది. ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని.. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖ రాసింది.

  • 'సొమ్మొకడిది, సోకొకడిదిలా ఉంది జగన్ వైఖరి'

వైకాపా సర్కారుపై తెదేపా నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం జగన్ మాయ మాటలు నమ్మేవారెవ్వరూ లేరన్నారు. ఈ మూడేళ్లో ఏం చేశారో చెప్పే ధైర్ఘ్యం సీఎంకు ఉందా.. అని నిలదీశారు.

  • KGF WEAPON: ఇదో నయా ట్రెండ్​... హత్యల్లోనూ 'కేజీఎఫ్' మేనియా

కేజీఎఫ్ సినిమా గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది జనాలను ఆకర్షించింది ఈ చిత్రం. అయితే అందరికి యశ్ యాక్టింగ్ నచ్చితే.. నేరస్థులకు మాత్రం యశ్ ఉపయోగించిన సుత్తి నచ్చిందనుకుంటా. అందుకే దాదాపు హత్యల్లో.. ఈ ఆయుధాన్నే ఎక్కువగా వాడుతున్నారు.

  • త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్​ కుమార్​ రాజీనామా

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు త్రిపుర సీఎం బిప్లవ్​ కుమార్​ దేవ్​ ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్​ ఎస్​ఎన్​ ఆర్యకు శనివారం తన రాజీనామా లేఖను అందించారు. త్రిపురలో పార్టీని బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని హైకమాండ్​ ఆదేశించినట్లు తెలిపారు

  • అమృత్​సర్​ గురునానక్​ దేవ్​ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

అమృత్‌సర్‌లోని గురునానక్‌ దేవ్‌ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగి ఆస్పత్రికి వ్యాపించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

  • కాంగ్రెస్ చింతన్​ శిబిర్​లో కీలక అంశాలపై చర్చ

రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌లో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా చేపట్టనున్న జనజాగరణ్‌ అభియాన్‌పై సోనియా, పార్టీ నేత రాహుల్‌ గాంధీ చర్చించారు.

  • గ్రామస్థుల నీటి కష్టాలు.. మట్టి తవ్వితేనే గొంతు తడిసేది..!

మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లాలోని ప్రజలకు వేసవి కష్టాలు తప్పడం లేదు. నీటి చుక్క దొరకడమే గగనమైపోయింది.

  • చైనాకు త్వరలో కొత్త అధ్యక్షుడు.. జిన్​పింగ్ రాజీనామా!

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ తన పదవికి రాజీనామా చేస్తారని వదంతులు వ్యాపిస్తున్నాయి. కరోనా కట్టడిలో విఫలం కావడమే గాక, ఆర్థికవ్యవస్థ పతనానికి జిన్​పింగ్ తప్పుడు నిర్ణయాలే కారణమని చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  • IPL 2022: ఆర్సీబీకి ప్లేఆఫ్స్‌ బెర్తు కష్టమేనా?

ఈ ఐపీఎల్ సీజన్​లో బెంగళూరు ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. లీగ్‌ స్టేజ్‌ పూర్తయ్యేసరికి ఏ స్థానంలో నిలుస్తుందో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి.

  • జులై 8న ‘థ్యాంక్‌ యూ’ రిలీజ్​- విలన్​గా 'రాజారాణి' నటుడు

నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న 'థ్యాంక్‌ యూ' సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను జులై 8న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details