- చంద్రబాబుకు మహిళా కమిషన్ నోటీసులు అందజేత
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు పేరుతో ఉన్న నోటీసు కాపీని తెదేపా పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బందికి అందజేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శ్రీశైలం కెనరా బ్యాంకులో రూ.80 లక్షల కుంభకోణం..
నంద్యాల జిల్లా శ్రీశైలం కెనరా బ్యాంకులో రూ.80 లక్షల కుంభకోణం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బ్యాంకు మేనేజర్‌తో పాటు గోల్డ్ అప్రైజర్‌ను అరెస్టు చేసినట్లు శ్రీశైలం సీఐ బీవీ రమణ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- "నాకు ఇచ్చిన గన్‌మెన్లు నాతో ఉండట్లేదు"
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు డ్రైవర్ దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టుకు నివేదించినట్లుగా పోలీసులు తనకు రక్షణ కల్పించట్లేదని ఆరోపించారు. పులివెందుల దాటి వెళ్తే తన వెంట సెక్యూరిటీ రావట్లేదని.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- "వసతుల కొరతపై దృష్టి పెట్టకుండా.. అవినీతి పెరిగిపోతోందని ప్రచారమేంటి?"
ప్రభుత్వం సౌకర్యాల లేమితో పాటు వసతుల కొరతపై ఏమాత్రం దృష్టిపెట్టకుండా.. రెవెన్యూశాఖలో అవినీతి పెరిగిపోతోందని ప్రచారం చేయడం ఏంటని.. ఆ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'హైకోర్టుల్లో త్వరలోనే స్థానిక భాషల అమలు.. కానీ!'
దేశంలోని వివిధ హైకోర్డుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టటంపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ. త్వరలోనే శాస్త్ర సృజనాత్మకత, కృత్రిమ మేధ ద్వారా అది సాధ్యమవుతుంది కానీ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రూజర్- ట్రక్కు పరస్పరం ఢీకొనగా ఏడుగురు మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాతూర్- అంబాజోగాయీ రహదారిపై ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీబీఎస్ఈ సిలబస్‌లో 'ప్రజాస్వామ్యం' చాప్టర్ కట్.. ఇంకా ఎన్నో..
ప్రజాస్వామ్యం, అలీనోద్యమం వంటి ప్రధాన చాప్టర్లను సిలబస్ నుంచి తొలగించింది సీబీఎస్ఈ. పారిశ్రామిక విప్లవం, ఇస్లాం రాజ్యాల ఆవిర్భావం, లౌకికవాదానికి సంబంధించిన పలు అంశాలను పక్కనబెట్టింది. ఎందుకంటే?..పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వినియోగదారులకు షాక్.. ఆ కార్ల ధరలు మరింత ప్రియం
ప్రయాణికుల వాహన ధరలను మరోసారి పెంచింది టాటా మోటార్స్. నిర్వహణ వ్యయాలు, ముడిపదార్థాల ధరల పెరుగుదల వల్ల ఈ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయక తప్పడంలేదని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదు.. స్టూడియోలో ఫ్లోర్స్ క్లీన్ చేశా'
తాను నటిగా కెరీర్ ప్రారంభించడానికంటే ముందు స్టూడియోలో ఫ్లోర్స్ శుభ్రం చేశానని చెప్పారు బాలీవుడ్ నటి రవీనా టాండన్. ఇటీవలే విడుదలైన 'కేజీయఫ్ 2' సినిమాలో రమికా సేన్‌గా నటించి మెప్పించిన ఆమె.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పుష్ప- 2 షూటింగ్ మరింత ఆలస్యం.. కారణం అదేనా?అల్లుఅర్జున్ 'పుష్ప 2' సినిమా షూటింగ్ ఇంకా మొదలవ్వడానికి చాలా సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్.. ఈ సినిమా కోసం మరోసారి స్క్రిప్టులో మెరుగులు దిద్దుతున్నారట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5pm top news