ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM - ఆంధ్రప్రదేశ్ ముఖ్యవార్తలు

ప్రధాన వార్తలు @ 3 PM

3pm top news
ప్రధాన వార్తలు @ 3 PM

By

Published : Aug 10, 2021, 3:04 PM IST

  • తెదేపా ఎస్సీ సెల్ నేతలు

విజయవాడలో తెదేపా ఎస్సీ సెల్ నేతలు చేపట్టిన ఆందోళన ఎట్టకేలకు విరమించారు. ఎస్సీల హక్కులు కాపాడాలని చేపట్టిన ప్రతిఘటన ర్యాలీతి అనుమతి నిరాకరించడంతో ఆందోళనకు దిగారు. సీతమ్మపేటలో ఫంక్షన్ హాల్ ఎక్కి 5 గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తాత్కాలికంగా నిలిపివేసిన సీబీఐ

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం పులివెందులలో మూడు రోజుల పాటు సీబీఐ అధికారులు అన్వేషించారు. ఎలాంటి ఆయుధాలు దొరక్కపోవటంతో అన్వేషణ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నదిలో తోసేశారు!

ప్రేమ పేరుతో నమ్మించి.. యూపీకి రప్పించి ఆమె నగలను దోచుకున్నాడు ఓ వ్యక్తి. ఆపై ఆమెను హత్య చేశాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడితో పాటు.. మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టీకా వేస్తామని ఇంటికి వచ్చి..

తాము వాలంటీర్లమని, టీకా వేయడానికి వచ్చామని చెప్పి ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని ఓ జంట మోసగించింది. ఇంటి పత్రాలపై ఆరాతీయటంతో అనుమానం వచ్చిన వృద్ధురాలు వారిని బయటకు వెళ్లమంది. కానీ వారు ఆమెను కట్టేసి బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటన కర్నూలు స్టాంటన్‌పురంలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అదే ప్రభుత్వ లక్ష్యం​'

ప్రతీ ఇంట్లో ఎల్​పీజీ గ్యాస్​ స్టవ్​ ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉజ్వల 2.0 పథకాన్ని ఉత్తర్​ప్రదేశ్​లో వర్చువల్​గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిరుపేదలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అనుమతి ఉంటేనే..

ప్రజాప్రతినిధులపై కేసుల స్టేటస్​ రిపోర్టును అందించేందుకు కేంద్రం 2 వారాల గడువు కోరగా.. అసహనం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. నివేదిక అందించేందుకు ఎందుకింత సమయం? అని ప్రశ్నించింది. చట్టసభ్యుల కేసుల విచారణను వేగంగా జరపాలని కోరుతూ పిటిషన్ల పిటిషన్లు దాఖలు చేయగా.. ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీ అగ్నిప్రమాదం

పంజాబ్​ జలంధర్​ జిల్లాలోని ప్లాస్టిక్​ పైపుల తయారీ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడగా.. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. దావానలాన్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మీ ఎస్​బీఐ అకౌంట్ క్లోజ్​!

మీకు ఎస్​బీఐలో ఖాతా ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. ఖాతాదారులంతా.. సెప్టెంబర్ 30 లోపు పాన్​-ఆధార్​ అనుసంధానం పూర్తి చేయాలని స్పష్టం చేసింది ఎస్​బీఐ. లేదంటే బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని హెచ్చరించింది. ఎస్​బీఐ ప్రకటన పూర్తి వివరాలు మీకోసం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఒలింపిక్స్​లో క్రికెట్​

ఒలింపిక్స్​లో(Olympics) క్రికెట్​ను చేర్చే అవకాశాలున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ICC) స్పందించింది. విశ్వక్రీడల్లో క్రికెట్​ను ​చేర్చేందుకు సన్నాహాలు జరుపుతున్నామని ఐసీసీ అధ్యక్షుడు గ్రెగ్​ బార్క్​లే వెల్లడించారు. 2028లో అమెరికాలోని లాస్​ఏంజెలెస్​​(Los Angeles Olympics 2028) వేదికగా జరగనున్న విశ్వక్రీడల్లో క్రికెట్​కు అవకాశం కల్పించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అలరిస్తోన్న 'పాగల్'

నరేశ్‌ కొప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పాగల్​'. ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ట్రైలర్​ని విడుదల చేసింది చిత్రబృందం. హృషికేశ్‌, సుబ్బు, ప్రియాంక శర్మ, మాళవిక ప్రధాన పాత్రల్లో విడుదలకు సిద్ధమైన 'బొమ్మల కొలువు' ట్రైలర్​ కూడా విడుదలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details