రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రేపటి నుంచి (అక్టోబర్ 15, మంగళవారం) ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ కొనుగోలు కేంద్రాల్లో ప్రకటించిన మద్దతు ధరలకు ప్రభుత్వమే రైతుల నుంచి కొనుగోలు చేస్తుంది. ప్రతి రైతు తాము సాగు చేసిన పంటను గ్రామ వ్యవసాయ లేదా ఉద్యానవన సహాయకుడు ద్వారా "ఈ - క్రాప్" ప్రక్రియలో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగా అక్టోబరు 15న 31 చోట్ల మినుములు, పెసలు కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రారంభిస్తోంది. ఈ మేరకు పంటల కనీస మద్ధతు ధరల వివరాలను కూడా వెల్లడించింది.
మద్దతు ధరకు ప్రభుత్వం చర్యలు.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు! - ap latest news
పంటలకు మద్దతు ధర కల్పించటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గిట్టుబాటు ధర ఇచ్చి మినుములు, పెసలు కొనుగోలు చేసేందుకు ఈనెల 15 నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మినుములకు క్వింటాలకు 5వేల 7వందల రూపాయలు, పెసలకు 7 వేల 50 రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి 18 వందల 15 రూపాయలుగా మద్దతు ధర నిర్ణయించారు. సాగుచేసిన పంటను గ్రామ వ్యవసాయ లేదా ఉద్యానవన సహాయకుడి ద్వారా "ఈ-క్రాప్" విధానంలో నమోదు చేసుకోవాలాలని రైతులకు సూచించింది.
31 crop purchasing centers started in ap october 15