తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. కొత్తగా మరో 2,924 కరోనా కేసులు నమోదు కాగా... 10 మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 1,23,090కు చేరగా.. 818 మంది మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 461 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19 నుంచి మరో 1,638 మంది బాధితులు కోలుకోగా.... ఆ సంఖ్య 90,988కి చేరింది. ప్రస్తుతం 31,284 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు తెలిపారు. 24,176 మంది బాధితులు హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.