ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఒకే వాహనానికి 26 చలాన్లు

అతడి ద్విచక్రవాహనంపై 26 చలాన్లు ఉన్నాయి. అయినా... ఎంచక్కా తప్పించుకు తిరుగుతున్నాడు. హైదరాబాద్‌లో పోలీసుల కళ్లుగప్పినా... కరీంనగర్‌లో మాత్రం దొరికిపోయాడు.

By

Published : Apr 9, 2021, 12:29 PM IST

26 challans for a single vehicle
చలానాను చూపిస్తున్న పోలీసులు

హైదరాబాద్​లో పోలీసుల కళ్లు గప్పి నుంచి తప్పించుకున్నా.. కరీంనగర్ జిల్లాలోని బ్లూ కోట్ సిబ్బంది నుంచి తప్పించుకోలేక పోయాడు ఓ వ్యక్తి. సిరిసిల్లకు చెందిన సుంక వెంకటేశ్​ హైదరాబాద్​లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో బైక్​ నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనికి 26 చలాన్లు వచ్చాయి.

అయినా పోలీసులకు కనిపించకుండా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను వీణవంక పోలీసుల చేతికి చిక్కాడు. కొత్త వ్యక్తి కావడం అనుమానాస్పదంగా తిరుగుతుండటం వల్ల పోలీసులు ఆరా తీశారు. బండి నంబర్ చెక్ చేయడం వల్ల 26 చలాన్లు, రూ.8,325 జరిమానా ఉన్నట్లు తేలింది. దీంతో జరిమానా వసూలు చేసి వాహనం తిరిగి అప్పగించారు.

ఇదీ చూడండి :ఎక్సైజ్ మహిళా ఎస్సైపై దురుసు ప్రవర్తన.. వైకాపా కౌన్సిలర్​పై కేసు

ABOUT THE AUTHOR

...view details