రాజధాని గ్రామాల్లో 257వ రోజూ రైతులు, మహిళల పోరాట దీక్షలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానులు వద్దు... అమరావతిని పరిపాలన రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు నినదిస్తున్నారు. అమరావతిని పరిరక్షించాలంటూ తుళ్లూరులో రైతులు, మహిళలు సర్వమత ప్రార్థనలు చేశారు.
అబ్బరాజుపాలెంలో పోలేరమ్మకు మహిళలు పొంగళ్లు సమర్పించారు. ఉద్దండరాయునిపాలెంలో ఎండలో పడుకొని రైతులు నిరసన చేపట్టారు. టెంట్ వేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటూ రైతులు నిరసన చేపట్టారు.