ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పీఎంఏవై కింద రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు - pmay scheme sanctioned houses in ap

ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన కింద కేటాయించిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంలో ఆంధ్రప్రదేశ్​ మూడో స్థానంలో ఉన్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్​సింగ్​ తెలిపారు. రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు మంజూరైనట్లు పేర్కొన్నారు.

పీఎంఏవై కింద రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు
పీఎంఏవై కింద రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు

By

Published : Dec 28, 2019, 6:31 AM IST

ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన కింద రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్​సింగ్​ పూరి తెలిపారు. దేశ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కోటి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. 30 లక్షల ఇళ్లు ఇప్పటికే లబ్ధిదారుల చేతికి చేరాయనీ మరో 60 లక్షల ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యిందన్నారు. 2014లో నరేంద్రమోదీ ప్రభుత్వం అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని సంకల్పించి... 2022 నాటికి అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. కేటాయించిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంలో తొలి స్థానంలో ఉత్తర ప్రదేశ్‌ నిలవగా.. రెండో స్థానంలో గుజరాత్‌, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నట్లు మంత్రి తెలిపారు. క్రెడిట్‌ లింక్‌ సబ్సిడీ పథకం కింద సుమారు 8.81 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని, త్వరలో ఈ సంఖ్య 10 లక్షలు దాటే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. అందరికీ ఇళ్లు పథకంలో ఇప్పటి వరకూ 6.5 లక్షల ఇళ్లు మహిళల పేరిట ఉన్నాయని... ఈ సంఖ్య మరింత పెరగడానికి ఆస్కారం ఉందన్నారు. ఈ పథకం వల్ల 1.20 కోట్ల మందికి ఉపాధి లభించిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details