ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM - top news

..

top news
ప్రధాన వార్తలు

By

Published : Dec 26, 2020, 12:59 PM IST

  • ఆ ఎంపీ నుంచి ప్రాణహాని.. వైకాపా కార్యకర్త పోస్ట్​ వైరల్​...

బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా వెలగపూడికి చెందిన వైకాపా కార్యకర్త సలివేంద్ర సురేశ్ ఆరోపించాడు. ఎంపీ సురేశ్ అనుచరులు తనపై దాడికి యత్నించారని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విశాఖలో టెన్షన్​... ప్రమాణానికి సిద్ధమైన తెదేపా, వైకాపా నేతలు

విశాఖలో నేతల ప్రమాణాల సవాళ్లతో పోలీసులు అప్రమత్తమ్యారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. మూడ్రోజులుగా తెదేపా ఎమ్మెల్యే, వైకాపా నాయకుల మధ్య ప్రమాణ సవాళ్లు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రూ.10వేల టికెట్ కొన్నా​ లఘు దర్శనం లేదా? శ్రీవారి భక్తుల ఆందోళన

పదివేల రూపాయలు చెల్లించి శ్రీవాణి టిక్కెట్ల ద్వారా దర్శనానికి వచ్చిన తమకు లఘు దర్శనం కల్పించలేదని ఆరోపిస్తూ....తిరుమలలో భక్తులు అందోళనకు దిగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్నేహలత హత్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్​కు తెదేపా ఫిర్యాదు

అనంతపురం జిల్లా ధర్మవరం యువతి హత్య ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ , జాతీయ మహిళా కమిషన్​లకు తెదేపా ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'రుణ యాప్‌లు వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించొద్దు'

ఆన్​లైన్ రుణ సంస్థలు.. అవసారానికి అప్పులిచ్చే యాప్​లు.. వాటిని వసూలు చేసే సమయంలో హుందాగా వ్యవహరించాలని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌.గాంధీ అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 31వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన

నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతన్నలు చేస్తోన్న నిరసనలు 31వ రోజుకు చేరాయి. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ దిల్లీ సరిహద్దుల్లో పెద్దఎత్తున ఉద్యమం చేపట్టారు అన్నదాతలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అఫ్గానిస్థాన్​లో 15 మంది తాలిబన్లు హతం

అఫ్గానిస్థాన్​లోని చోమ్​టల్​, బలా బొలొక్ జిల్లాల్లో ఆ దేశ రక్షణశాఖ జరిపిన దాడుల్లో 15 మంది తాలిబన్లు హతమయ్యారు. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్ రక్షణ శాఖ ట్విట్టర్​లో స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రక్త క్యాన్సర్​కు కొత్త మందులు

రక్త క్యాన్సర్​ చికిత్సకు కొత్త ఔషధాలను కనిపెట్టారు అమెరికాలోని క్లీవ్​ల్యాండ్​ క్లినిక్​ శాస్త్రవేత్తలు. వీరిలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉండడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత బౌలర్లు భళా.. ఆస్ట్రేలియా 195 ఆలౌట్

బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఆతిధ్య ఆసీస్​ 195 పరుగులకే ఆలౌట్ అయింది. బుమ్రా 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్​తోనే సిరాజ్, గిల్.. భారత్ తరఫున టెస్టు అరంగేట్రం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మహేశ్​బాబు జెంటిల్మన్.. బాలీవుడ్​ హీరో ప్రశంసలు

మహేశ్​తో పనిచేయడం చాలా గర్వంగా ఉందని చెప్పారు బాలీవుడ్ హీరో రణ్​వీర్ సింగ్. తనో 'ఫైనెస్ట్ జెంటిల్మన్' అని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details