ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 176 కరోనా కేసులు

By

Published : Jan 1, 2022, 6:56 PM IST

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 176 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి కొత్తగా 103 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

corona cases
corona cases

AP Corona Cases: రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 30,717 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 176 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 103 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,227 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..
India covid cases: మరోవైపు దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 22,775 కేసులు వెలుగుచూశాయి. మరో 406 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,949 మంది కోలుకున్నారు. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,431కి చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

  • మొత్తం కేసులు: 3,48,61,579
  • మొత్తం మరణాలు: 4,81,486
  • యాక్టివ్ కేసులు: 1,04,781
  • కోలుకున్నవారు: 3,42,75,312

Vaccination in India
దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శుక్రవారం మరో 58,11,487 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,45,16,24,150 కు చేరింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు..
Worldwide covid cases today:ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 16 లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 5,627 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • అమెరికాలో కొత్తగా 4.43 లక్షల కేసులు నమోదయ్యాయి. 716 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8.46లక్షలకు చేరింది.
  • ఫ్రాన్స్​లో 2.32లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 189 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,23,741కు చేరింది.
  • బ్రిటన్​లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా లక్షా 89 వేల కేసులు నమోదయ్యాయి. 203 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.
  • అర్జెంటీనాలో ఒక్కరోజే 47 వేల కరోనా కేసులు బయటపడ్డాయి. 23 మంది కరోనాతో మరణించారు. 2.30 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
  • ఇటలీలో 1.44 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 155 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 61,25,683కు పెరిగింది. మరణాల సంఖ్య 1,37,247కు చేరుకుంది.

ఇదీ చదవండి:

వంగవీటి రాధా ఇంటికి చంద్రబాబు.. రెక్కీ ఘటనపై ఆరా

Vaishno Devi Temple: 'ఆ గొడవ వల్లే వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట!'

ABOUT THE AUTHOR

...view details