ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

APMDC:ఏపీఎండీసీ నుంచి జేపీ సంస్థకు 14 లక్షల టన్నుల ఇసుక - JP Company latest updates

ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అప్పగించిన ఇసుక నిల్వలకు జేపీ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ ఇప్పటివరకు చెల్లింపులు చేయలేదు. ఈ డబ్బుల కోసం ఏపీఎండీసీ వెంటపడుతున్నప్పటికీ జేపీ సంస్థ మాత్రం సాకులు చెబుతూ నెట్టుకొస్తోందనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు తొలుత ఏపీఎండీసీ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ ఏడాది కొత్తగా టెండర్లు పిలిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇసుక టెండరును జేపీ సంస్థ దక్కించుకొని మే 14న బాధ్యతలు చేపట్టింది.

ఏపీఎండీసీ నుంచి జేపీ సంస్థకు 14 టన్నుల ఇసుక
ఏపీఎండీసీ నుంచి జేపీ సంస్థకు 14 టన్నుల ఇసుక

By

Published : Jul 19, 2021, 4:46 AM IST

Updated : Jul 19, 2021, 7:49 AM IST

ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అప్పగించిన ఇసుక నిల్వలకు జేపీ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ ఇప్పటివరకు చెల్లింపులు చేయలేదు. ఈ డబ్బుల కోసం ఏపీఎండీసీ వెంటపడుతున్నప్పటికీ జేపీ సంస్థ మాత్రం సాకులు చెబుతూ నెట్టుకొస్తోందనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు తొలుత ఏపీఎండీసీ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ ఏడాది కొత్తగా టెండర్లు పిలిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇసుక టెండరును జేపీ సంస్థ దక్కించుకొని మే 14న బాధ్యతలు చేపట్టింది. అప్పటివరకు ఏపీఎండీసీ పలు జిల్లాల్లోని డిపోల్లో నిల్వ చేసిన దాదాపు 14 లక్షల టన్నుల ఇసుకను జేపీ సంస్థకు అప్పగించారు. వీటికి టన్నుకు రూ.475 చొప్పున దాదాపు రూ.66 కోట్ల వరకు ఏపీఎండీసీకి చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు స్పందన లేదు. డిపోల్లో నిల్వ ఉన్న ఇసుక విక్రయించాకే ఆ డబ్బులు ఇస్తామంటూ జేపీ సంస్థ చెబుతున్నట్లు తెలిసింది. రేవుల్లో ఇసుక విక్రయిస్తున్నప్పటికీ ఏపీఎండీసీకి మాత్రం ఇప్పుడే డబ్బులు ఇవ్వలేమని పేర్కొన్నట్లు సమాచారం.

ఏపీఎండీసీ గతంలో వివిధ స్టాక్‌పాయింట్లు, డిపోల్లో 117 వేబ్రిడ్జిలను అమర్చింది. వీటితోపాటు అన్నిచోట్ల అమర్చిన 1300 వరకు సీసీ కెమెరాలను జేపీ సంస్థకు అప్పగించారు. మొబైల్‌ డివైజ్‌లు, ప్రింటర్లు, బయోమెట్రిక్‌ డివైజ్‌లు కూడా అప్పగించినట్లు చెబుతున్నారు. అయితే వీటన్నింటికీ కూడా డబ్బులు ఇంకా ఇవ్వలేదు. మరోవైపు ఈ డబ్బులు వస్తేనే గతంలో ఏపీఎండీసీకి ఇసుక రవాణా చేసిన గుత్తేదారులకు రూ.కోట్ల బకాయిలను చెల్లించే వీలుందని అధికారులు చెబుతున్నారు.

హౌసింగ్‌ బిల్లుల్లో రాబడదాం...

జేపీ సంస్థ నుంచి ఇసుక డబ్బులు రాబట్టేందుకు ఏపీఎండీసీ, గనులశాఖ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. జేపీ సంస్థ ప్రస్తుతం జగనన్న కాలనీలకు ఇసుక సరఫరా చేస్తోంది. ఆ డబ్బులను గృహనిర్మాణ సంస్థ చెల్లించనుంది. దీంతో జేపీ సంస్థకు చెల్లింపులు చేసే సమయంలోనే ఏపీఎండీసీకి రావాల్సిన బకాయిలను రాబట్టాలని చూస్తున్నారు. ఈ మేరకు ఓ ప్రతిపాదన చేసినట్లు ఏపీఎండీసీ వర్గాల సమాచారం.

ఇదీ చదవండి:

jagan polavaram tour: నేడు పోలవరానికి సీఎం జగన్

Last Updated : Jul 19, 2021, 7:49 AM IST

ABOUT THE AUTHOR

...view details