రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30,933 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 121 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,82,142కి చేరింది. వైరస్ బారిన పడి తాజాగా మరొకరు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 7,130కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 289 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,72,561కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,450 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,23,55,607 శాంపిల్స్‌ని పరీక్షించినట్లు బులెటిన్‌లో వెల్లడించిది.
రాష్ట్రంలో కొత్తగా 121 కరోనా కేసులు... ఒకరు మృతి - ఆంధ్రప్రదేశ్ తాాజా వార్తలు
రాష్ట్రంలో కొత్తగా 121 కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,82,142కి చేరింది. తాజాగా వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.
today ap corona cases