- విశాఖలో మంకీపాక్స్ అనుమానిత కేసు.. వైద్యశాఖ అలర్ట్
ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్.. విశాఖ వైద్య అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యాధి లక్షణాలు ఓ వైద్య విద్యార్థినిలో గుర్తించారు. దీంతో.. వ్యాధి నిర్ధారణకు చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అలాంటి తలాక్ చెల్లదు : హెకోర్టు
ఇస్లాం విడాకుల పద్ధతిపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా చెపితే.. తలాక్ నామా రూపంలో రాసుకున్నా కూడా అది చెల్లదని.. భార్య స్థానం అలాగే ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Srikalahasteeswaram: శ్రీకాళహస్తీశ్వరానికి ప్రత్యేక ఆహ్వానితులు..
Srikalahasteeswaram: శ్రీకాళహస్తీశ్వరానికి ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మకర్త మండలికి అనుబంధంగా మరో ఎనిమిది మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. వీరు ఆదివారం గంగాసదనంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాడేరులో.. వింత శిశువు జననం!
Strange baby born: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వింత శిశువు జన్మించింది. జననేంద్రియాలు నిర్ధారించలేని పరిస్థితుల్లో శిశువు ఉండడం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- VICE PRESIDENT POLL: ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ షురూ.. ఓటేసిన మోదీ
Vice president election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఓటేసేందుకు లైన్లలో నిల్చున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో తగ్గిన కరోనా కేసులు.. జపాన్‌లో రెండున్నర లక్షలకు పైగా..
Covid Cases In India: భారత్‌లో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 19,406 మంది వైరస్ బారిన పడగా.. 49 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు జపాన్‌లో 2.5 లక్షలు, దక్షిణ కొరియాలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- UK PM race: సునాక్‌కు కొత్త ఉత్సాహం.. టీవీ చర్చలో 'ఆమె'పై గెలుపు
UK PM race: బ్రిటన్ ప్రధాని పదవికి పోటీలో ఉన్న రిషి సునాక్.. తాజాగా ఓ టీవీ చర్చలో విజయం సాధించారు. గురువారం రాత్రి ఓ టీవీ ఛానెల్లో చర్చ జరిగింది. ఇందులో ఎవరు విజయం సాధించారనే విషయంపై నిర్వహించిన ఎన్నికలో సునాక్‌కే పార్టీ సభ్యులు ఆధిక్యం కట్టబెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మహీంద్రా' భళా.. ఏడు రెట్లు పెరిగిన లాభం.. ఆదాయం భారీగా జంప్!
Mahindra and Mahindra Q1 results: జూన్ త్రైమాసికంలో ఏడు రెట్లు అధికంగా నికర లాభాన్ని నమోదు చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. రూ.2360 కోట్ల ఏకీకృత నికర లాభం గడించినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఆదాయం రూ.19171.91 కోట్ల నుంచి రూ.28412.38 కోట్లకు చేరింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అంపైర్ చీటింగ్'.. హాకీలో మహిళల జట్టు ఓటమి.. షూటౌట్లో తేలిన సెమీస్ ఫలితం
Commonwealth games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా జరిగిన మహిళల హాకీలో భారత్.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 1-1తో మ్యాచ్ డ్రా కావడం వల్ల నిర్వహించిన షూటౌట్లో 3-0 తేడాతో పరాజయం పాలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దుల్కర్‌కు జోడీగా సమంత.. తెరపైకి మంగళ్యాన్ విజయగాథ
Telugu cinema updates: 'యశోద', 'ఖుషి' చిత్రాలతో తీరిక లేకుండా ఉన్న స్టార్ హీరోయిన్ సమంత.. దుల్కర్ సల్మాన్‌కు జోడీగా నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు, 2019లో విడుదలై సంచలన విజయం అందుకున్న 'జోకర్'.. సినిమాకు కొనసాగింపుగా మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీన్ని 2024 అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 11 AM