ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM - ap top ten news

..

11AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11 AM

By

Published : Jun 2, 2022, 10:58 AM IST

  • కాకినాడ జిల్లాలో మళ్లీ పశువులపై పెద్దపులి దాడి!
    కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో మరోసారి పశువులపై పులి దాడి చేసింది. పాండవులపాలెం-పొదురుపాక సమీపంలో ఆవును చంపింది. ఈ ఘటనతో శరభవరం, పాండవులపాలెం, పోతులూరు, ఒమ్మంగి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Srisailam dam: "శ్రీశైలం"లో.. రూ. కోటి బిల్లుకూ దిక్కులేదు!
    Srisailam dam: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి కీలక జలాశయం అది... అందులో చేయాల్సిన పనులెన్నో... అయితే ఇప్పటివరకూ చేసిన పనులకు చేయాల్సిన చెల్లింపులు కూడా ఎన్నో... వరదల సమయంలో కుదుపులకు గురై దెబ్బతింటూనే ఉంది. పెండింగ్​ బిల్లులే ఇవ్వనప్పుడు... మిగిలిన పనులు ఎలా చేయాలని అధికారులు ఇబ్బందులు పడుతున్నారు... ఇంతకీ ఆ జలశయం ఏదో అనుకునేరు... శ్రీశైలం జలశయమే. ఇప్పుడు ఆ డ్యాం పరిస్థితి ఎలా ఉందంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Tirumala Laddu: తిరుమలలో లడ్డూల కొనుగోళ్లపై పరిమితి
    తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో తితిదే లడ్డూలపై పరిమితి విధించింది. ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూతో పాటు అదనంగా రెండు మాత్రమే కొనుక్కోడానికి అనుమతి ఇస్తున్నారని భక్తులు తెలిపారు. గతంలో రూ.50 చొప్పున ఎన్నయినా కొనుక్కునే వీలు ఉండేది. ప్రస్తుతం భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో లడ్డూలను పరిమిత సంఖ్యలోనే కొనేందుకు అనుమతిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఒకరినొకరు కాల్చుకొని జవాన్లు మృతి.. ఆ గొడవే కారణం!
    SRPF Jawan Fired: ఇద్దరు ఎస్​ఆర్​పీఎఫ్ జవాన్లు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో ఇరువురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సముద్రాన్ని ఈది బంగ్లాదేశ్​ నుంచి భారత్​కు.. ప్రియుడి కోసం యువతి సాహసం!
    ఫేస్​బుక్​లో పరిచయమైన యువకుడిని గాఢంగా ప్రేమించింది ఆ బంగ్లాదేశ్​ యువతి. అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా పులులు తిరిగే అడవిని దాటి, మొసళ్లతో నిండిన నదిని ఈది భారత్​కు​ చేరుకుంది. ఆలయంలో వివాహం కూడా చేసుకుంది. అక్కడే అసలు ట్విస్ట్​ మొదలైంది. అమ్మాయి గురించి తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పట్టపగలే కత్తులతో పొడిచి.. గర్భిణీ టీచర్​ దారుణ హత్య.. రాజకీయ దుమారం​!
    Pregnant Teacher Murder: ఐదు నెలల గర్భిణీ టీచర్​ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ విషాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో బుధవారం జరిగింది. అయితే ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దుండగులకు ఉపాధ్యాయులు లక్ష్యంగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. నిందితుడితో సహా ఐదుగురు మృతి
    అమెరికాలోని ఓక్లహోమాలో తుపాకుల మోత మోగింది. ఆసుపత్రి క్యాంపస్​లోని మెడికల్​ బిల్డింగ్​లో జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నిందితుడు కూడా ఉన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా?
    Gold Price Today: బంగారం, వెండి ధరలు గురువారం మళ్లీ భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,520గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,110 దాటింది. వరుసగా రెండు సెషన్లు నష్టాలు నమోదుచేసిన దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు.. గురువారం ఫ్లాట్​గా ట్రేడవుతున్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వివాహ బంధంలోకి అడుగుపెట్టిన భారత స్టార్​ క్రికెటర్.. ఫొటోలు వైరల్
    Deepak Chahar Wedding: వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు టీమ్​ఇండియా స్టార్ ఆల్​రౌండర్ దీపక్ చాహర్. తన కల్యాణానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Kamal Haasan: రజనీతో దాని గురించి మాట్లాడను: కమల్​ హాసన్
    Kamal Haasan on Rajinikanth: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇటీవలే మీడియాతో మాట్లాడిన కమల్​.. తన స్నేహితుడు, సూపర్​స్టార్ రజనీకాంత్​ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. రజనీతో సినిమాల నుంచి ప్రజల వరకు అన్ని విషయాలు మాట్లాడే కమల్​.. ఓ విషయం గురించి మాత్రం ప్రస్తావన తీసుకురారట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details