- అర్ధరాత్రి తెదేపా నేత అరెస్ట్.. స్టేషన్ వద్దే దేవినేని ఉమ!
Aluri Harikrishna: గొల్లపూడిలో తెదేపా నాయకుడు ఆలూరి హరికృష్ణ చౌదరి(చిన్నా)ని పోలీసులు అరెస్టు చేశారు. వన్‌టౌన్ పీఎస్‌కు తరలించారు. అయితే.. ఏం కేసు నమోదు చేశారో చెప్పకుండా అరెస్టు చేశారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరికృష్ణ అరెస్టుపై అభ్యంతరం వ్యక్తం చేసిన దేవినేని ఉమ.. రాత్రి నుంచి పీఎస్ వద్దే ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హైదరాబాద్ పరువు హత్య : ఇక్కడ చంపేసి.. కర్నాటకలో దాక్కున్నారు!
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని బేగం బజార్లో నిన్న జరిగిన పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందుతుల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కర్నాటకలో ఉన్నారని గుర్తించిన పోలీసులు.. అక్కడికెళ్లి పట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- "పదవి పోయినా నేనే సీనియర్‌ను.. ఆ మంత్రుల వద్దకు వెళ్లకండి"
Muttamsetti Srinivasa Rao: "నాకు మంత్రి పదవి లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు వేరే మంత్రుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స తర్వాత నేనే సీనియర్‌ని. ఎలాంటి పనులున్నా చేయగలను. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తా. కాబట్టి పక్క జిల్లాల మంత్రుల దగ్గరకు వెళ్లొద్దు" ఇవి ఇటీవల మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవిని కోల్పోయిన ఎమ్మెల్యే చెప్పిన మాటలు. ఇంతకీ ఆయనెవరంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Rathotsavam: వైభంగా పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం
Narasimha Swamy rathotsavam: అనంతపురం జిల్లా పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం వైభంగా జరిగింది. రెండేళ్ల తర్వాత ఉత్సవాలు జరుగుతుండటంతో పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు, మరణాలు
Covid Cases In India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,323 కేసులు నమోదు కాగా, మహమ్మారి కారణంగా మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. కోలుకున్నవారి సంఖ్య 98.75 శాతానికి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'స్వతంత్రంగా తీర్పులిచ్చారు.. ఆయన రిటైర్మెంట్ 'సుప్రీం'కు లోటు'
CJI Ramana news: జస్టిస్ లావు నాగేశ్వరరావు ధైర్యంగా, స్వతంత్రంగా తీర్పులు ఇచ్చారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. ఆయన పదవీ విరమణతో మంచి సలహాదారుడిని కోల్పోతున్నానని వ్యాఖ్యానించారు. యువ న్యాయవాదులకు ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని పేర్కొన్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ కాలంపై జస్టిస్ నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బ్రిటిష్ కుబేరుల జాబితాలో భారత సంతతి.. సునాక్ దంపతులకు చోటు
Rishi Sunak: బ్రిటిష్ వార్షిక కుబేరుల జాబితాలో భారత సంతతికి చెందిన బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషీ సునాక్, భారత పౌరసత్వమున్న ఆయన భార్య అక్షతా మూర్తి స్థానం సంపాదించారు. శుక్రవారం 'సండే టైమ్స్' పత్రిక ప్రచురించిన జాబితాలో తొలిసారిగా చోటు దక్కించుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఎఫ్‌డీఐ'ల వరద.. జీవితకాల గరిష్ఠానికి విదేశీ పెట్టుబడులు
FDI inflow all time: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరాయి. 2021-22లో 83.57 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ వచ్చినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల ఫలితంగా ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భర్త ప్రోత్సాహం.. ఆమె పట్టుదల.. జాతీయ ఛాంపియన్‌గా ఎదిగి
National Champion Arm wrestler Chetna sharma: రెజ్లర్ అంటే మగవారే అనే నమ్మకాన్ని మార్చింది 31 ఏళ్ల చేతనాశర్మ. పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో ప్రవేశం ఉన్న ఈమెకు ఆర్మ్ రెజ్లింగ్ గురించి తెలిసి అందులోకి అడుగుపెట్టి ఎన్నోసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. మధ్యలో వరుస గాయాలెన్ని బాధపెట్టినా తిరిగి కోలుకొని టైటిల్స్ గెలుచుకున్న ఈ ఆర్మ్ రెజ్లర్ ప్రయాణంలో ఎదురైన సవాళ్ల గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు: బాలయ్య
NTR 100 year birth Anniversary: మే 28న ప్రారంభమయ్యే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు 365 రోజులు జరుగుతాయని హీరో బాలకృష్ణ ప్రకటన చేశారు. తమ కుటుంబం నుంచి నెలకొక్కరు ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 11 AM