ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11AM - ఏపీ ముఖ్యవార్తలు

...

TOP NEWS
TOP NEWS

By

Published : Dec 31, 2021, 11:01 AM IST

  • Teachers shortage: సర్కారీ బడుల్లో ఉపాధ్యాయుల కొరత.. టీచర్లు కావాలంటూ విద్యార్థుల నిరసన
    సర్కారీ బడుల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రమైంది. 2018 తర్వాత పదవీ విరమణలే గానీ.. కొత్త నియామకాలు లేకపోవడంతో ఉన్నవారితోనే నెట్టుకురావాల్సిన దుస్థితి నెలకొంది. అనేక చోట్ల ఒకేఒక్క ఉపాధ్యాయుడు నాలుగైదు తరగతులను నెట్టుకొస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Jobs To Students: వెయ్యి మంది విజ్ఞాన్‌ విద్యార్థులకు ఉద్యోగాలు
    గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్‌ డీమ్డ్‌ టూ బీ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులు 1600 ఉద్యోగావకాశాలు సాధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Liquid Fertilizers Cost Increases: పిచికారీ మందుల ధరలకు రెక్కలు..!
    పైర్లపై పిచికారీ చేసే పురుగు, తెగుళ్లు, కలుపు మందుల ధరలు తాజాగా 8 నుంచి 11 శాతం వరకు పెరిగాయి. నాలుగు నెలల కిందట పెరిగిన మొత్తంతో కలిపితే.. సగటున 15 నుంచి 20 శాతం వరకు చేరుకున్నాయి. దీంతో రైతుల పెట్టుబడి మరింత పెరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • APPSC: ఏపీపీఎస్సీలో ఉద్యోగాల భర్తీకి మళ్లీ ప్రిలిమ్స్​!.. అయోమయంలో ఉద్యోగార్థులు
    గ్రూప్-1 మినహా.. మిగిలిన ఉద్యోగాలకు స్క్రీనింగ్ పరీక్ష ఉండదన్న ఏపీపీఎస్సీ.. మళ్లీ ప్రిలిమ్స్‌ ప్రవేశపెట్టనుంది. గ్రూఫ్-4 కేటగిరిలోకి వచ్చే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీలో రెండు పరీక్షలూ ఉంటాయని తాజా నోటిఫికేషన్​లో స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 16వేల మందికి వైరస్​
    దేశంలో కొత్త కరోనా కేసులు భారీగా పెరిగాయి. మరో 16,764 కేసులు నమోదయ్యాయి. 220 మంది మరణించారు. గురువారం 66,65,290 మందికి టీకాలు అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పుతిన్​కు బైడెన్​ స్ట్రాంగ్​ వార్నింగ్​- అదే జరిగితే..!
    రష్యా అధ్యక్షుడు పుతిన్​కు అమెరికా అధ్యక్షుడు బైడెన్​ వార్నింగ్​ ఇచ్చారు. ఉక్రెయిన్​తో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నించాలని లేకపోతే ఆంక్షలతో విరుచుకుపడతామని తేల్చిచెప్పారు బైడెన్​. అదే జరిగితే ఇరు దేశాల బంధం బలహీనపడుతుందని పుతిన్​ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • అమెరికాలో 'కొవిడ్​' ఉప్పెన.. ఒక్కరోజులో 5.6లక్షల కేసులు
    అమెరికాలో కొవిడ్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. ఒక్కరోజులో ఏకంగా 5.6లక్షల కేసులు నమోదయ్యాయి. అటు ఐరోపానూ కరోనా గడగడలాడిస్తోంది. బ్రిటన్​, ఫ్రాన్స్​లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Stock Market Live: లాభాల్లో దేశీయ సూచీలు- 58 వేలు మార్క్​ దాటిన సెన్సెక్స్​
    దేశీయ సూచీలు ఈ ఏడాది చివరి సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 300 పాయింట్లకుపైగా లాభంతో.. 58 వేల మార్కును దాటింది. మరో సూచీ నిఫ్టీ 100 పాయింట్లకుపైగా వృద్ధి చెంది.. 17,306 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • India Rewind 2021: టాప్ స్కోరర్, టాప్ వికెట్ టేకర్ వీరే!
    అంతర్జాతీయ క్రికెటలో ఈ ఏడాది టీమ్​ఇండియా అంతగా రాణించలేకపోయిందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ మొత్తంగా స్వదేశం, విదేశాల్లో కలిపి 13 టెస్టులు, ఆరు వన్డేలు, 16 టీ20లు ఆడింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details