- తెదేపా నేతల గృహ నిర్బంధం
రాష్ట్రంలోని కొవిడ్ ఆస్పత్రుల్లో సౌకర్యాలను పరిశీలించేందుకు తెలుగుదేశం పిలుపునిచ్చిన 'కొవిడ్ బాధితులకు భరోసా' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆస్పత్రుల సందర్శనకు వెళ్తున్న తెదేపా నేతలను గృహ నిర్బంధం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- '3 అక్రమ కేసులు, 6 అరాచకాలు
ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ఇతర తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పరిశోధన ప్రారంభం
కృష్ణపట్నం ఆనందయ్య మందు పనితీరుపై పరిశోధన ప్రారంభమైంది. ఆనందయ్య మందుపై సీసీఆర్‌ఏఎస్ 4 దశల్లో పరిశోధన, విశ్లేషణ జరపనుంది. మొదటి దశలో భాగంగా మందు తీసుకున్న వారి నుంచి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అభిప్రాయాలు సేకరించనుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మృతుల్లో.. 65% పురుషులే..!
కరోనా బారిన పడుతున్న వారిలో అధిక శాతం మంది పురుషులే ఉంటున్నారు. బయట ఎక్కువగా తిరుగుతుండటంతో వారికి వైరస్ త్వరగా సోకుతోంది. మద్యపానం, ధూమపానం, గుట్కా వంటి అలవాట్లు కూడా ఓ కారణంగా చెప్పొచ్ఛు వీటి మూలంగా ఊపిరితిత్తులు దెబ్బతింటుండటంతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా మారణహోమం
దేశంలో కొవిడ్ మరణాలు మరోసారి పెరిగాయి. ఆదివారం మరో 4,454 మంది కొవిడ్‌కు బలయ్యారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య మూడు లక్షల మార్క్‌ను దాటింది. కొత్తగా 2.22 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చర్చలకు సిద్ధం.. కానీ!