ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM - 11 am top news

ప్రధాన వార్తలు @ 11 AM

11AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11 AM

By

Published : May 27, 2021, 11:02 AM IST

  • తెదేపా మహానాడు.. ప్రత్యక్షప్రసారం

తెదేపా డిజిటల్ మహానాడు ప్రారంభమైంది లైవ్​ వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • ముందే అనుమతి తీసుకోవాలి

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పరిపాలన విభాగాల్లో.. ఈ ఏడాది మార్చి 31 వరకూ ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే.. కేంద్రం సెన్సస్ ప్రక్రియ మొదలు పెట్టే లోపే అనుమతి తీసుకోవాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చాపకింద నీరులా ఫంగస్

జిల్లాల్లో బ్లాక్‌ ఫంగస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజుకు పదులు సంఖ్యలో బ్లాక్​ ఫంగస్ భారిన పడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఫంగస్​ భారిన పడ్డవారిలో ఎక్కువగా కరోనా నుంచి కోలుకున్నవారే కావటం.. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు అప్రమత్తమయ్యారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేడు హైకోర్టులో విచారణ

ఆనందయ్య ఔషధం పంపిణీపై విచారణకు అనుమతించిన హైకోర్టు.. ఇవాళ వాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య మందు పంపిణీపై అనంతపురం జిల్లాకు చెందిన ఉమామహేశ్వరనాయుడు దాఖలు చేసిన పిటిషన్​ను ఉన్నత న్యాయస్థానం స్వీకరించింది. ఇవాళ విచారణ చేయనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మరో 12 మందికి పరిహారం

రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక చనిపోయిన ఘటనలో మరో 12 మందికి పరిహారం అందించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆరుగురికి చెక్కుల పంపిణీ పూర్తయ్యిందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 2.11 లక్షల కేసులు

దేశంలో కొత్తగా 2,11,298 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 3,847 మంది కొవిడ్​తో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,15,235కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ముంచెత్తిన వర్షం

తమిళనాడు కన్యాకుమారి(kanyakumari) జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. కురుంబనా గ్రామంలో కుండపోతగా కురిసిన వాన(rains)లతో సమీపంలోని మూడు చెరువులు నిండిపోయాయి. కట్టలు తెగి వరదలు సంభవించగా ఆ గ్రామప్రజలు నిరాశ్రయులయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కేంద్రం X వాట్సప్‌

నూతన ఐటీ చట్టాలపై కేంద్రం-వాట్సాప్​ల మధ్య వివాదం ముదురుతోంది. ఐటీ నిబంధన రాజ్యాంగ విరుద్ధమంటూ దిల్లీ హైకోర్టు(delhi high court)లో వాట్సప్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత్‌కు ఇబ్బందే!

కొలంబో నౌకాశ్రయం(colombo port) భారత్‌ నుంచే అత్యధిక ఆదాయం పొందుతోంది. ఇంతటి వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్న ఈ నౌకాశ్రయానికి చేరువలోనే చైనా(china) సారథ్యంలోని పోర్టు సిటీకి శ్రీలంక అధినాయకత్వం శరవేగంగా అనుమతులు మంజూరు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు'

ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టు మ్యాచ్​పై స్పందించింది భారత ఓపెనర్​ స్మృతి మంధాన. ఇలా గులాబి టెస్టు ఆడే రోజు వస్తుందని తాను ఊహించలేదని.. ప్రస్తుతం అది సాకారం కాబోతుందని వెల్లడించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'శ్రీరామ దండకం'

శుక్రవారం లెజెండరీ నటుడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్​ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు బాలయ్య. స్వయంగా ఆయనే పాడిన శ్రీరామ దండకాన్ని విడుదల చేయనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details