దేశీయ, విదేశీ సంస్థాగత మదుపర్లు భారీగా కొనుగోళ్లు జరుపుతుండగా స్టాక్మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 250పాయింట్లు పెరిగి 36వేల 865వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 75పాయింట్ల వృద్ధితో 11వేల 10 వద్ద ట్రేడవుతోంది.
వడ్డీరేట్ల మార్పు విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరింత కాలం వేచిచూసే ధోరణి అవలంబిస్తుందన్న వార్తలు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ రేపటి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లు యథాతథంగా ఉంచుతుందన్న అంచనాలు స్టాక్మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. ఐటీ, లోహ రంగాల వాటాల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.
లాభనష్టాల్లోనివివే...
టెక్ మహీంద్రా, జూబ్లియెంట్ ఫుడ్ల షేర్లు అత్యధికంగా 7 శాతం వృద్ధి చెందాయి. హెచ్పీసీఎల్, జీ ఎంటర్టైన్ మెంట్స్, హెచ్సీఎల్ టెక్, విప్రోలు లాభాల జాబితాలో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్ 2 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.