ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / business

పెట్టుబడికి 5 చిట్కాలు - పెట్టుబడి

మీరు ఆర్థికంగా ఎదగాలని భావిస్తున్నారా.. ప్రణాళికవంతమైన పెట్టుబడితో మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనుకుంటున్నారా..అయితే ఈ సమాచారం మీకోసమే

పెట్టుబడికి 5 చిట్కాలు

By

Published : Feb 9, 2019, 12:07 AM IST

పెట్టుబడికి 5 చిట్కాలు
మీరు ఏ పని చేసినా డబ్బు పెట్టుబడి అనేది ప్రాథమికమైనది. ఫిక్స్​డ్ డిపాజిట్, జీవితబీమా పథకాలు, మ్యూచువల్ ఫండ్స్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇళ్లు కొనాలనుకున్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నా, పిల్లల చదువు కోసం, రిటైర్ అయిన తర్వాత జీవితాన్ని సంతోషంగా గడపాలన్నా పెట్టుబడి చేయడం మంచిది.

వీలనైంత తొందరగా ప్రారంభించండి

మీరు ఎంత తొందరగా పెట్టుబడి చేయడం ప్రారంభిస్తే అంతగా అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. కచ్చితమైన ప్రణాళికతో, అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. రిస్కుకు ఇష్టపడేవారైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేయడం మంచిది. కాస్త తక్కువగా రిస్కు కోరుకునే వారు మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టండి.

పదవీ విరమణ గురించి ముందే జాగ్రత్త అవసరం

అందరూ చేసే తప్పు రిటైర్​మెంట్ గురించి ఆలోచించకపోవడం. ఉద్యోగంలో చేరిన వెంటనే పదవీ విరమణ గురించి ఆలోచించడం మంచిది. సమయం ఎక్కువగా ఉండటం వల్ల పొదుపు చేసే నగదు తక్కువగా ఉంటుంది. మీకు సౌకర్యంగా ఉంటుంది. అన్ని ఆర్థిక అవసరాలు తీర్చడానికి వీలుంటుంది.

ఆర్థిక ప్రణాళిక కోసం సమయం వెచ్చించండి

చాలా మంది ఉద్యోగంలో చేరాక ఖర్చు గురించి ఆలోచించరు. వారికి ఒక కచ్చితమైన ప్రణాళిక అంటూ ఉండదు. ఇబ్బందులు రావచ్చు. పనికి ఎక్కువ సమయం కేటాయించడం.. పొదుపుపై ప్రభావం చూపిస్తుందని స్విస్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ సర్వేలో తేలింది. వారు డబ్బు పెట్టుబడి గురించి ఎక్కువగా ఆలోచించలేకపోతున్నారని తెలిపింది.

దీర్ఘకాలిక అవసరాల కోసం ఆలోచించడం మంచిది

దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనుకుంటే క్రమశిక్షణ అవసరం. ఒకవేళ అలా జరగకపోతే నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. ఉదాహరణకు మార్కెట్లు ఒడిదొడుకులకు గురవగానే పెట్టుబడిని ఉపసంహరించుకోవడానికి మొగ్గు చూపుతారు. అది మంచిది కాదు. ఈక్విటీల్లో పెరుగుదలను నమోదు చేసే ప్లాన్స్ చూసి పెట్టుబడి పెట్టండి.

సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలి

పెట్టుబడిపై కొందరికి అవగాహన ఉండకపోవచ్చు. తెలిసిన వారు చెప్పిన ప్రతి విషయాన్ని నమ్మవద్దు. మీరూ కొన్ని విషయాలపై అవగాహన ఏర్పరచుకోండి. అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది.

డబ్బు పెట్టుబడి అనేది బ్రహ్మప్రదార్థం కాదు. ఇప్పుడే ఎందుకు.. తరవాత ఆలోచిద్దామని అనుకుంటారు. ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత ఎక్కువగా లాభాల్ని పొందవచ్చన్న విషయాన్ని మరిచిపోతుంటారు. అలాంటి వారు మీ మైండ్​సెట్​ని మార్చుకుని త్వరగా పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం తీసుకోండి.

ABOUT THE AUTHOR

...view details