ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / business

ఏ వస్తువు  ఏ నెలలో కొంటే లాభం? - నెల

ఫిబ్రవరి నెలలో ఏ వస్తువులు చౌకగా లభిస్తాయి? కొత్త బట్టలు కొనేందుకు ఏది మంచి సమయం? అక్టోబర్​ నెలకు ఉన్న మరో పేరేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబుల కోసం ఈ కథనం చదవండి.

ఏ వస్తువు  ఏ నెలలో కొంటే లాభం?

By

Published : Feb 9, 2019, 8:14 AM IST

Updated : Feb 9, 2019, 8:47 AM IST

12 నెలల కాలంలో ఏదో ఒక వస్తువు, ఏదో ఒక నెలలో ఆఫర్లతో మార్కెట్లోకి వస్తుంటుంది. అసలే భారతీయులకు డిస్కౌంట్​లంటే ఎనలేని మక్కువ. ఏ వస్తువు ఎప్పుడు తక్కువ ధరలో వస్తుందా అని ఆలోచిస్తారు. మరి ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎలా కొనాలో నెలల వారీగా వివరాలు మీకోసం..

1. జనవరి - వ్యాయామ సామగ్రి

నూతన సంవత్సరంలో ఎక్కువమంది నిర్దేశించుకునే లక్ష్యం... 'కసరత్తులు'. అందుకే జనవరిలో ఎక్కువ అమ్ముడయ్యే వస్తువుల జాబితాలో ముందు వరుసలో ఉంటాయి ఈ వ్యాయామ సామగ్రి. వినియోగదారులను ఆకట్టుకోవడానికి వ్యాపారులు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. సుమారు 30 నుంచి 70 శాతం డిస్కౌంట్​లతో ఇవి లభిస్తాయి. మీరు ఒకవేళ వీటిని కొనుగోలు చేయాలంటే జనవరి నెల అత్యుత్తమం.

2. ఫిబ్రవరి - కెమెరా, ఎల్​ఈడీ టీవీ

శీతాకాలం మంచు అందాలను వీక్షించడానికి విదేశీ పర్యటనలకు సిద్ధమవుతారు పర్యటకులు. ఈ సమయంలో వీరు మొదట కొనుగోలు చేసే వస్తువు కెమెరా. ఫిబ్రవరిలో కెమెరాలు అత్యధికంగా అమ్ముడవుతాయి. వివిధ సంస్థలు నూతన మోడళ్లు విడుదల చేయడమే కాక... ఆఫర్లు ప్రకటించడంలో పోటీ పడతాయి.
ఎక్కువగా అమ్ముడయ్యే మరో వస్తువు టీవీ. ఫిబ్రవరిలో ఎల్​ఈడీ టీవీలు అమ్మకాలు భారీగా ఉంటాయని ఒక మార్కెట్​ సర్వేలో తేలింది. ఈ నెలలో టీవీలపై ఆఫర్లు ఘనంగానే ఉంటాయి.

3. మార్చి-చల్లటి ఆహార పదార్థాలు

శీతాకాలం పోయి భానుడి ప్రతాపం మొదలయ్యే నెల ఇది. ఈ నెలలో చల్లటి ఆహార పదార్థాలకున్న డిమాండ్​ అంతా ఇంతా కాదు. ఈ ఒక్క నెల వ్యాపారంతో సంవత్సరం ఆదాయం సంపాదిస్తుంటాయి శీతలపానీయ సంస్థలు. ఐస్​క్రీం, కూల్​డ్రింక్స్​పై వివిధ ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి.

ఫ్రిజ్​, ఎసీలు కూడా ఇదే కోవలోకి వస్తాయి. ఈ నెలలో వీటిపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి తయారీ సంస్థలు.

4. ఏప్రిల్​ - పన్ను లావాదేవీ సాఫ్ట్​వేర్​లు, సౌందర్య ఉపకరణాలు

ఏప్రిల్​ అనగానే పన్ను లావాదేవీలు గుర్తొస్తాయి. అందుకే వీటికి సంబంధించిన అమ్మకాలు భారీగా జరుగుతాయి. ఆఫర్లు అదే స్థాయిలో ఉంటాయి.
ఈ నెలలో సౌందర్య ఉపకరణాలూ అధికంగా అమ్ముడవుతాయి. పెళ్లిల్లు సహా పలు శుభకార్యాలు ఈ నెల అధికంగా జరగడమే వీటి డిమాండ్​కు కారణం.

5. మే- దుస్తులు

మేలో అత్యధికంగా అమ్ముడయ్యేవి దుస్తులు. ఈ నెలలో వీటిపై సూమారు 30 నుంచి 70 శాతం వరకు డిస్కౌంట్​ ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్ కూడా కావటం దీనికి కారణం.

6.జూన్​ - గృహ అలంకరణ వస్తువులు

జూన్​లో అలంకరణ వస్తవులకు డిమాండ్​ అధికంగా ఉంటుందని ఓ సర్వేలో తేలింది. వివిధ సంస్థలు కూడా చక్కటి ఆఫర్లతో వీటిని అందిస్తాయి.

7. జులై-పాదరక్షలు

జులైలో ఎక్కువ అమ్ముడయ్యే వస్తువులు పాదరక్షలు. అందుకే సంస్థలు మంచి ఆఫర్లతో మార్కెట్లోకి వస్తాయి.

8.ఆగస్టు- లాప్​ట్యాప్​లు

ఆగస్టులో లాప్​ట్యాప్​లు, కంప్యూటర్ పరికరాలపై డిస్కౌంట్లు అధికంగా ఉంటాయని ఓ మార్కెట్​ సర్వే తేల్చింది.

9. సెప్టెంబర్​ - గ్రిల్స్​ ,రక్షణ సామగ్రి

సెప్టెంబర్​లో గ్రిల్స్​, రక్షణ సామగ్రికి డిమాండ్​ అధికం. ఈ నెలలో దొంగతనాలకు ఎక్కువ ఆస్కారం ఉండటమే ఇందుకు కారణమని ఓ సర్వే స్పష్టం చేసింది.

10. అక్టోబర్​ - కార్లు, ఆటోమొబైల్​ అమ్మకాలు

అక్టోబర్​ను ఆటోమొబైల్​ నెల అంటారు. ఈ నెలలో వివిధ సంస్థలకు చెందిన కార్లు, వివిధ మోడళ్లలో భారీ ఆఫర్లతో మార్కెట్లోకి విడుదలవుతాయి. కార్లు కొనడానికి అక్టోబర్​ అనుకూల సమయం.

11. నవంబర్​ - విద్యుత్​ ఉపకరణాలు

నవంబర్​ నెలలో విద్యుత్​ ఉపకరణాలు చౌకగా లభిస్తాయి.

12. డిసెంబర్ - క్రీడా సామగ్రి

డిసెంబర్​లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే క్రీడల వైపు ప్రజలు ఎక్కువ మక్కువ చూపిస్తారు. క్రీడా వస్తువుల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. డిస్కౌంట్​లూ ఇదే స్థాయిలో ఉంటాయి.

Last Updated : Feb 9, 2019, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details