ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / business

Covid Dryswab test kit: రూ. 60లోపే కొవిడ్ పొడి పరీక్ష - Corona latest updates

కొవిడ్‌ (Covid) నిర్ధరణకు చేసే పొడి పరీక్ష (డ్రైస్వాబ్‌- డైరెక్ట్‌ ఆర్‌టీపీసీఆర్‌ Direct RTPCR) కిట్ల వ్యయం మరింత దిగిరానుంది. సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (CCMB) అభివృద్ధి చేసిన పొడి పరీక్ష కిట్ల తయారీకి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి.

Covid DrySwab test
రూ. 60లోపే కొవిడ్ పొడి పరీక్ష

By

Published : Jun 3, 2021, 7:34 AM IST

కొవిడ్‌ (Covid) నిర్ధరణకు చేసే పొడి పరీక్ష (డ్రైస్వాబ్‌- డైరెక్ట్‌ ఆర్‌టీపీసీఆర్‌ Direct RTPCR) కిట్ల వ్యయం మరింత దిగిరానుంది. సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (CCMB) అభివృద్ధి చేసిన పొడి పరీక్ష కిట్ల తయారీకి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఎక్కువ సంస్థలతో ఒప్పందం కారణంగా లభ్యత పెరగడంతో పాటు ధరలూ తగ్గుతున్నాయి. భారత్‌కు చెందిన గ్లోబల్‌ మెడికల్‌ డివైజెస్‌ కంపెనీ ‘మెరిల్‌’ సంస్థ తాజాగా సీసీఎంబీ (CCMB)తో ఒప్పందం చేసుకుంది.

తాము తయారు చేసే ఒక్కో కిట్‌తో 100 పరీక్షలు చేయవచ్చని, ఒక్కో పరీక్షకు అయ్యే వ్యయం రూ.45 నుంచి రూ.60 మధ్య ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. ‘‘పొడి పరీక్ష కిట్లను తయారు చేస్తున్న తొలి సంస్థ మాదే. దీంతో.. ఆర్‌టీ-పీసీఆర్‌ (RTPCR) పరీక్ష ఫలితాలు వేగంగా వెల్లడించేందుకు వీలవుతుంది. నెలకు 2 కోట్ల కిట్లను తయారు చేసే సామర్థ్యం మాకుంది. ఇప్పటికే కొవిడ్‌ యాంటిజెన్‌ కిట్లతోపాటు యాంటీబాడీ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లను తయారు చేస్తున్నాం’’ అని ‘మెరిల్‌’ ఉపాధ్యక్షుడు సంజీవ్‌ భట్‌ తెలిపారు. డ్రైస్వాబ్‌తో చౌకగా, వేగంగా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని.. ఆర్‌ఎన్‌ఏ వేరుచేయకుండా నేరుగా పరీక్షించవచ్చని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ నందికూరి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details