ETV Bharat / briefs
చెప్పండి.. మీకేమైనా తెలుసా?!! - AP SIT
వైఎస్ వివేకా మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం కడప జిల్లా పులివెందులలో.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించింది. జగన్ సోదరి షర్మిల, వివేకా కూతురు సునీతతో మాట్లాడారు.
సిట్ అధికారులు
By
Published : Mar 16, 2019, 2:54 PM IST
| Updated : Mar 16, 2019, 5:00 PM IST
వివేకా కూతురు సునీత, జగన్ సోదరి షర్మిల నుంచి వివరాలు సేకరిస్తున్న సిట్ అధికారులు వైకాపా అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో విచారణను ప్రత్యేక దర్యాప్తు బృంద సిబ్బంది ముమ్మరం చేశారు. కడప జిల్లా పులివెందులలో వివేకా ఇంట్లో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, అడిషనల్ డీజీ అమిత్, క్లూస్ టీమ్ సిబ్బంది కలిసి.. వేలిముద్రల నిపుణులతో క్షుణ్నంగా తనిఖీ చేశారు. పడక గది, స్నానాలగదిని పరిశీలించారు. వివేకా కూతురు సునీత, వైఎస్ జగన్ సోదరి షర్మిలతో మాట్లాడారు. ఘటనపై వివరాలు ఆరా తీశారు. Last Updated : Mar 16, 2019, 5:00 PM IST