ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తెలంగాణ ఆర్టీసీ బస్సుపై దాడి...ఆరుగురు అరెస్టు - బస్సుపై దాడి

నిన్న రాత్రి ఆర్టీసీ బస్సుపై దాడి చేసిన ఘటనలో ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద బస్సు డ్రైవర్, యువకులపై కేసులు నమోదు చేశారు. ఈ దాడిలో పాల్గొన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

By

Published : Jun 2, 2019, 3:51 PM IST

Updated : Jun 2, 2019, 4:03 PM IST

తెలంగాణ ఆర్టీసీ బస్సుపై దాడి...ఆరుగురు అరెస్టు

విజయవాడలో నిన్న అర్ధరాత్రి అల్లరి మూకలు బీభత్సం సృష్టించారు. గొల్లపూడి సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులు...దారి ఇవ్వలేదన్న కోపంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సుపై దాడిచేశారు. బస్సు ఆపి డ్రైవర్‌‌ను చితకబాదారు. అనంతరం బస్సు టిమ్​లో రూ.25 వేలు తీసుకెళ్లారు. యువకుల బీభత్సంతో భయబ్రాంతులైన ప్రయాణికులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మొత్తం 20 మంది యువకులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు...ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన యువకులపై 332, 394 రెడ్‌విత్34 ఐపీసీ, 341 సెక్షన్ల కింద, ప్రభుత్వాస్తుల ధ్వంసం సెక్షన్‌లోనూ కేసు పెట్టారు. ఆర్టీసీడ్రైవర్‌పై 337 ఐపీసీకింద భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

Last Updated : Jun 2, 2019, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details