వైకాపా ఎమ్మెల్యే ఆత్మహత్య బెదిరింపులు - సునీల్
జగన్ కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని ఆవేదన చెందిన పూతలపట్టు వైకాపా ఎమ్మెల్యే సునీల్ ఆత్మహత్య బెదిరింపులు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సునీల్ పెట్టిన సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
వైకాపా ఎమ్మెల్యే
జగన్ ఇంట్లోకి అనుమతించలేదని ఆవేదన చెందిన చిత్తూరు జిల్లా పూతలపట్టు వైకాపా ఎమ్మెల్యే సునీల్ పెట్టిన వీడియో ఈ మధ్య వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి సెల్ఫీ వీడియోతో కలకలం సృష్టించారు. ఆత్మహత్య బెదిరింపులు చేస్తూ వీడియో పెట్టారు. జగన్ కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని మనస్తాపం చెందిన సునీల్ సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో పెట్టారు. వైకాపా కార్యకర్తగానే చనిపోతానంటూ బెదిరింపులు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.