ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

వ్యాయామం చేయకున్నా ట్రంప్​ ఆరోగ్యం భేష్​ - Trump

ట్రంప్​కు పరీక్షలు చేసిన శ్వేతసౌధ వైద్యులు ఆయన ఆరోగ్యం భేషుగ్గా ఉందని ప్రకటించారు.

ట్రంప్​ ఆరోగ్యం భేష్​

By

Published : Feb 9, 2019, 2:03 PM IST

ట్రంప్​ ఆరోగ్యం భేష్​
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు​ 'ఫాస్ట్​ఫుడ్'​ అంటే విపరీతమైన ఇష్టం. అందుకే వీలు చిక్కినప్పుడల్లా జంక్​ఫుడ్​ తింటుంటారు. వ్యాయామం చేయడం మాత్రం ట్రంప్​కు ఇష్టం ఉండదు. అయినా ఆయన ఆరోగ్యానికి ఏ ఢోకా లేదని వార్షిక ఆరోగ్య పరీక్షలు జరిపిన శ్వేతసౌధ వైద్యులు వెల్లడించారు.

ట్రంప్​ మాజీ ప్రధాన వైద్యులు రాన్నీ జాక్సన్ గతంలోనూ ఇదే విషయాన్ని తెలిపారు. అధ్యక్షుడి ఆరోగ్య చిట్కా ఆయన 'జీన్స్'​ అని జాక్సన్​ చెప్పారు.

"అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆరోగ్యం మంచిస్థితిలో ఉంది. అధ్యక్ష పదవీకాలంతో పాటు ఆ తర్వాత కూడా ఆరోగ్యంగానే ఉంటారనుకుంటున్నా."
- సీన్​ కాన్లే, శ్వేతసౌధం ప్రధాన వైద్యుడు

తన ఆరోగ్య పరిస్థితిపై ట్రంప్​ స్పందించారు.

ఎప్పుడూ వ్యాయామం చేసే నా స్నేహితుల్లో చాలా మంది మోకాళ్లు, నడుము శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. వారందరికీ వ్యాయామం మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. శ్వేతసౌధం చుట్టూ నడవడం, బహిరంగ సభల్లో నిలబడటమే నేను చేసే ప్రధాన వ్యాయామాలు.
-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ట్రంప్​...పొగకు దూరం

ట్రంప్​ ఇంతవరకూ​ పొగతాగలేదు. బీర్ కూడా ఎప్పుడూ​ సేవించలేదని తెలిపారు వైద్యులు. ట్రంప్​ ఆహార మెనూలో బీఫ్​, కోక్​ తప్పక ఉండాల్సిందేనని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details