రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు పగటిపూట బయటకు రావాలంటే భయపడుతున్నారు. సూర్యుడు ప్రతాపం చూపుతున్న ఈ వేసవిలో ప్రయాణాలు పెద్ద తంటనే తెచ్చిపెడుతున్నాయి. విశాఖ ప్రయాణికులకు ఈ అవస్థను తప్పించే ప్రయత్నం చేశారు రేడియో మిర్చి ఎఫ్.ఎం, సీఎంఆర్ సంస్థలు. సామాజిక సేవా దృక్పథంతో ఎ.సి బస్సు స్టాప్‌ను ఏర్పాటుచేశారు. విశాఖ నుంచి భీమిలి, తగరపు వలస వెళ్లే రహదారిలో బస్సు కోసం వేచి ఉండే ప్రయాణికుల కోసం ఈ శీతల బస్సుస్టాప్ సౌకర్యాన్ని కల్పించారు. ఈ సేవలను శుక్రవారం..విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ టి.కృష్ణబాబు ప్రారంభించారు.
విశాఖ ప్రయాణికుల కోసం...శీతల బస్సు స్టాప్ సదుపాయం - cmr
విశాఖ ప్రయాణికులకు ఓ చల్లని కబురు. తప్పనిసరి పరిస్థితుల్లో వేసవిలో ప్రయాణించే వారికోసం శీతల బస్సు స్టాప్ నిర్మించారు. భీమిలి, తగరపు వలస రోడ్డులో ఏర్పాటుచేసిన ఈ సౌకర్యం శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.
శీతల బస్సుస్టాప్ సుదుపాయం