'క్షమించండి...ఆ పదవి సమర్థుడికివ్వండి' - vja
లోక్‌సభలో పార్టీ తరఫున విప్ పదవి ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని..అయితే అంత పెద్ద పదవికి తాను అనర్హుడిగా భావిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని తెలిపారు. అర్హులకు ఆ పదవి ఇవ్వాలని సూచించారు.
ఎంపీ కేశినేని నాని అలక విడలేదు. నిన్న అదినేత చంద్రబాబు వద్ద జరిగిన సమావేశానికి హాజరైన ఆయన శాంతించలేదని అర్థమవుతోంది. లోక్‌సభలో పార్టీ ఉపనేత, విప్ పదవి అప్పగించినా తిరస్కరించారు. గల్లా జయదేవ్‌కు పార్లమెంటరీ పార్టీ నేతగా, రాంమోహన్ నాయుడును లోకసభపక్షనేతగాను నియామకంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. తనకు పార్టీ లో ప్రాధాన్యం కల్పించటం లేదని అసంతృప్తితో తన నియోజకవర్గంలో చంద్రబాబు నిర్వహించిన ఇఫ్తార్ విందుకు గైర్హాజరయ్యారు. నిన్నటి ముఖ్యనేతల సమావేశంలో చర్చించి పదవులు ఇచ్చినా ఫేస్‌బుక్‌లో అసంతృప్తి గళం వినిపించారు.లోక్ సభలో పార్టీ విప్ పదవి ఇచ్చినందుకు అధినేత చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపారు. తనకంటే సమర్ధుడైన వేరొకరిని ఆ పదవిలో నియమించాలని విజ్ఞప్తి చేశారు. అంత పెద్ద పదవి చేపట్టడానికి తాను అనర్హుడిగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. విజయవాడ ప్రజలు తనను ఎంపీగా ఎన్నుకున్నారని... వారి ఆశీస్సులు ఉన్నాయని... పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తి ఇస్తుందన్నారు. పదవి తిరస్కరిస్తున్నందుకు చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు.