యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెండు పేపర్లుగా ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించారు. విజయవాడలో 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా... ఉదయం పరీక్షకు 47శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 48శాతం అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 9వేల 872మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోగా... ఉదయం పరీక్షకు 4వేల 679, మధ్యాహ్నం పరీక్షకు 4వేల 780 హాజరయ్యారు. ప్రశ్నాపత్రంపై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమయ్యింది. ప్యాసేజీలు, స్టేట్ మెంట్ ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం వల్ల అన్ని ప్రశ్నలకు జవాబులిచ్చేందుకు సమయం సరిపోలేదని అభ్యర్థులు వెల్లడించారు. స్టేట్ మెంట్ ప్రశ్నలకు సమాధానాలు చాలా దగ్గరగా ఉండడం వల్ల అభ్యర్థులు తికమకపడినట్లు తెలుస్తోంది. ఆర్థికశాస్త్రం, చరిత్ర కు సంబంధించిన ప్రశ్నలు సైతం కఠినంగా ఉన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. గతేడాది ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంతో పోలిస్తే ఈ సారి కాస్త సులువుగా ఇచ్చినట్లు కొందరు అభ్యర్థులు భావిస్తున్నారు.
ముగిసిన యూపీఎస్సీ సివిల్స్ ప్రాథమిక పరీక్ష
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రధాన నగరాల్లో పరీక్ష నిర్వహించారు.
సివిల్స్ ప్రాథమిక పరీక్ష