- ఐసోలేషన్ కోసం.. చెట్టునే ఆవాసంగా మార్చుకున్న విద్యార్థి
ఆ యువకునికి కరోనా సోకింది. ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. కాని ఒకే గది ఉంది. ఐసోలేషన్ కోసం అతడికి ఏం చేయాలో తోచలేదు.. చివరికి ఇంటి ముందున్న చెట్టునే ఐసోలేషన్‌కు అనవుగా మార్చుకున్నాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వయసేదైనా..వదల బొమ్మాళీ!
కొవిడ్ కమ్మేస్తోంది.. వయసు ఏదైనా వదలనంటోంది.. పసికందుల నుంచి పండు ముదుసలి వరకు అందరినీ ఆవహిస్తోంది. మందులేని మహమ్మారి ప్రభావం శరీరంలో అన్ని భాగాలపై పడటంతో ప్రాణాపాయ స్థితి ఎదురవుతోంది. వైరస్ తీరుతో ప్రభావాలపై అంచనాకు రావడం వైద్యులకూ కష్టమే అవుతోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'జగన్ గారూ...ప్రాణమే లేనప్పుడు పథకాలెందుకు'
వైకాపా ప్రభుత్వంపై తెదేపానేత గుమ్మడి సంధ్యారాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులో ప్రజలు కొవిడ్ తో మరణిస్తుంటే.. కాపాడాల్సిన బాధ్యత సీఎం జగన్ కు లేదా అని ప్రశ్నించారు. 'పథకాలు కాదు.. ప్రాణాలు రక్షించండి' అని ప్రజలు అడుగుతుంటే జగన్ ఎందుకు సమాధానం చెప్పట్లేదని నిలదీశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కేరళలో తుపాను బీభత్సం- కుప్పకూలిన భవనం
తుపాను ధాటికి కేరళలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కాసర్గోడ్ జిల్లా చేరంగాయ్ తీర ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. వర్షాల ధాటికి ఇక్కడి ఓ రెండతస్తుల భవనం కుప్పకూలింది. అయితే.. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భవనం కూలడానికి ముందే అందులో నివసించే కుటుంబాలు ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి వెళ్లాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ రోజున 'బ్లాక్ డే' పాటించనున్న రైతులు
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. అన్నదాతలు చేపట్టిన ఆందోళన 6 నెలలు పూర్తి కావొస్తోంది. ఈ సందర్భంగా మే 26న 'బ్లాక్ డే' జరపాలని నిర్ణయించింది సంయుక్త కిసాన్ మోర్చా.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అగ్ని ప్రమాదం- ఐదుగురు సజీవ దహనం
బంగాల్లో అగ్ని ప్రమాదం జరిగి ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఆర్థిక సమస్యల కారణంగా యజమానే తన ఇంటికి నిప్పంటించాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'టీకా పంపిణీకి ఒక విధానం అవసరం'
దేశంలో టీకా పంపిణీని వెేగవంతం చేయడానికి ఒక విధానాన్ని రూపొందించాలని ఎయిమ్స్ డెరక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. రెండు నెలల వ్యవధిలో కొవిడ్ -19 వ్యాక్సిన్లు పెద్ద మొత్తంలో లభిస్తాయని చెప్పారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌కు 5కోట్ల వ్యాక్సిన్ డోసులు?
భారత్‌కు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ ఈ ఏడాదిలో 5 కోట్ల కరోనా టీకాలను సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రభుత్వంతో చర్చిస్తోందని సమాచారం. కాగా, ప్రస్తుతానికి టీకా ఎగుమతులకు అమెరికాలో అనుమతి లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టీమ్ఇండియాతో శ్రీలంక సిరీస్ కష్టమేనా?
జులైలో టీమ్ఇండియా, శ్రీలంక పర్యటన అనుమానంగా మారింది. అక్కడ వైరస్ కేసులు రోజురోజుకూ పెరగడమే ఇందుకు కారణం. కానీ ఈ సిరీస్ జరుగుతుందని అనుకుంటున్నట్లు లంక క్రికెట్ సీనియర్ అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సినీ కార్మికుల కోసం హీరో అజిత్ విరాళం
కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సినీ కార్మికులు, పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే వారికోసం రూ.10 లక్షల విరాళమిచ్చారు తమిళ కథానాయకుడు అజిత్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.