ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ప్రధానవార్తలు @7PM - ap top ten news

...

7PM
ప్రధానవార్తలు @7PM

By

Published : May 12, 2021, 7:00 PM IST

  • కరోనా ఉద్ధృతి: రాష్ట్రంలో మళ్లీ 20 వేలు దాటిన కేసులు
    రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,452 కరోనా కేసులు, 89 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 19,095 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,97,370 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దేశంలోనే టాప్‌టెన్‌లో మన యూనివర్సిటీలు నిలవాలి: సీఎం
    రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో ప్రమాణాలు పెరగాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. దేశంలో టాప్‌ టెన్‌లో మన యూనివర్సిటీలు నిలవాలని, ఆ మేరకు కార్యాచరణ రూపొందించాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రుయా ఆస్పత్రిలో చనిపోయింది 11 మంది కాదు.. 23 మంది: సీపీఐ నారాయణ
    తిరుపతి రుయా ఆస్పత్రిలో 11 మంది మాత్రమే మృతి చెందారని ప్రభుత్వం అసత్యం చెబుతోందని.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. మొత్తం 23 మంది చనిపోయారంటూ వారి పేర్లతో సహా వివరాలు తెలిపారు. ఆక్సిజన్ విషయంలో కేంద్రాన్ని రాష్ట్రప్రభుత్వం ఎందుకు నిలదీయలేకపోతోందని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సీఎం జగన్‌ ఆస్తుల కేసు.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ వాయిదా
    సీఎం జగన్ ఆస్తుల కేసుపై.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇందూ టెక్ జోన్ కేసులో జగన్‌పై నమోదైన అభియోగాలపై విచారణను న్యాయస్థానం ఈ నెల 20కి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వరుసగా రెండోరోజు తగ్గిన యాక్టివ్ కేసులు
    దేశంలో వరుసగా రెండో రోజు యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులోనే 11,122 యాక్టిన్ కేసులు తగ్గినట్లు పేర్కొంది. దీంతో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 37,04,009కు పరిమితమైందని తెలిపింది..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మెడికల్​ ప్రాక్టీస్​ చేసేందుకు వారికి కేంద్రం అనుమతి
    వైద్య విద్యార్హతలు ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. మెడికల్​ ప్రాక్టీసు, టెలీ కన్​సల్టేషన్​ సేవలు అందించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే.. ఖాళీ సమయాల్లో, పూర్తి స్వచ్ఛందంగా మాత్రమే ఇందులో పాల్గొనాలని స్పష్టం చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మరో టీకా రెడీ- జంతువు యాంటీబాడీలతో అభివృద్ధి!
    జంతువు యాంటీబాడీలతో కొవిడ్ టీకాను అభివృద్ధి చేసినట్లు తెలిపింది మహారాష్ట్రకు చెందిన ఓ ఫార్మా సంస్థ. తమ సంస్థ తయారు చేసిన టీకా సమర్ధంగా పనిచేస్తుందని చెబుతోంది. ప్రస్తుతం 3 లక్షల డోసులు వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 43కు చేరిన గాజా మృతుల సంఖ్య
    గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటివరకు 43మంది మృతి చెందారు. ఇందులో 13 మంది పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హాకీ మాజీ అంపైర్​ రవీందర్​ సింగ్ మృతి
    హాకీ మాజీ అంపైర్​ రవీందర్ సింగ్​​ సోది​ కరోనా సంబంధిత సమస్యల కారణంగా మరణించారు. ఈయన​ దిల్లీలో మృతి చెందినట్లు హాకీ ఇండియా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తెలుగు సంగీత దర్శకుడు కరోనాతో మృతి
    సంగీత దర్శకులు కీరవాణి, కోటి, మణిశర్మల గురువు చంద్రశేఖర్​.. కొవిడ్​తో మరణించారు. ఆయనకు పలువురు సినీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details